Nani Dasara Movie Teaser:లవ్ స్టోరీస్ – ఎంటర్టైన్మెంట్ సినిమాలతో యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న న్యాచురల్ స్టార్ నాని, మొట్టమొదటిసారి పూర్తి స్థాయి మాస్ రోల్ లో నటించిన చిత్రం ‘దసరా’..శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడితో తెరకెక్కించిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈరోజు విడుదల చేశారు.. నాని ఫ్యాన్స్ కి మొదటి నుండి ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

తమ హీరో ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మోతమోగిస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు..చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాని ని ఈ చిత్రం మరో లెవెల్ కి తీసుకెళ్తుందని,ఆయనకీ స్టార్ హీరో స్టేటస్ ని తెచ్చిపెడుతుందని ఆశించారు..ఈరోజు విడుదలైన టీజర్ చూస్తే వాళ్ళ నమ్మకాన్ని మించే ఈ చిత్రం ఉండబోతుంది అనే విషయం అర్థం అవుతుంది..అయితే ఈ టీజర్ లో మీరెవ్వరు గమనించని కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.
ఈ టీజర్ లో నానిని ఢీకొట్టే పాత్రలో నటించిన వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు.. ఇతగాడు మలయాళం లో పెద్ద స్టార్ హీరో అట..అతని పేరు షైన్ టామ్ చాకో..పేరు విచిత్రంగా ఉంది కదూ..కానీ ఈ సినిమాలో ఇతని విలనిజం చూస్తే ఎవరైనా ఫ్యాన్ అయ్యిపోవాల్సిందే అనే రేంజ్ లో ఆయన నటించాడట.. ఇక నాని గెటప్, ఆ సింగరేణి బ్యాక్ డ్రాప్ సెట్స్ చూస్తుంటే ఇందులో నాని సింగరేణి కార్మికుడిగా నటిచినట్టు అర్థం అవుతుంది.

నోట్లో మందు బాటిల్ పెట్టుకోవడం, లారీ కదులుతున్న సమయంలో స్టైల్ గా కాలు మీద కాలు వేసుకున్న షాట్స్ గూస్ బంప్స్ రప్పించాయి..ఇక టీజర్ చివర్లో నోట్లో కత్తి పెట్టుకొని , చేతి బొటన వేలు ని కోసి ఆ రక్తంతో తన నుదిటి మీద బొట్టు పెట్టడం వంటి షాట్స్ అదుర్స్.. మొత్తం మీద ఈ పాత్ర తీరు చూస్తుంటే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకి దగ్గర పోలికలు ఉన్నట్లు గా కనిపిస్తుంది.