spot_img
Homeఎంటర్టైన్మెంట్Vishnu Manchu: మంచు విష్ణు మరీ అంత శాడిస్టా?! వీడియో వైరల్..

Vishnu Manchu: మంచు విష్ణు మరీ అంత శాడిస్టా?! వీడియో వైరల్..

Vishnu Manchu
Vishnu Manchu

Vishnu Manchu: మంచు ఫ్యామిలీలో ఇటీవల విభేదాలు బయటపడడంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల మంచు మనోజ్ ఇంట్లో జరిగిన వివాదంపై మంచు విష్ణు స్పందించి.. ఇది చిన్న గొడవే దానిని పెద్దగా చేయొద్దని అన్నారు. కానీ మనోజ్ మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. అయితే అయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో విష్ణు గురించి మనోజ్ చెప్పిన కొన్ని సరదా విషయాలు ఇప్పుడు నిజంగానే మారాయాని కామెంట్ పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

‘మా అన్న విష్ణు క్యారెక్టర్ ప్రత్యేకం. నేను మా అక్కయ్య ఒక వైపు ఉంటే… విష్ణు ఒకవైపు ఉంటాడు. మా ఇద్దరిపై విష్ణు చాడీలు చెప్పేవాడు. మమ్మల్ని ఆడుకొమ్మని చెప్పి తాను వెళ్లి చదువుకునేవాడు. అలా బాగా చదివి నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసేవాడు. విష్ణు ఏదైనా చెప్పింది చేయకపోతే నా మీద నాన్నకు చాడీలు చెబుతానని బెదిరించేవాడు. ఒకసారి నేను ట్రాఫిక్ లో దిగాను. ఈ విషయం నాన్నకు చెప్పొద్దని బతిమిలాడాను. అయితే డాడీకి చెప్పకుండా ఆరు నెలల పాటు తన పనులన్నీ చేయించుకున్నాడు’ అని మనోజ్ చెప్పుకొచ్చారు.

Vishnu Manchu
Vishnu Manchu

గతంలో మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో సరదాగా విష్ణు గురించి ఈ విషయాలన్నీ చెప్పాడు. అయితే ఈ వీడియోను కొందరు బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. ఇటీవల మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు రావడంతో మంచు మనోజ్ కు సంబంధించిన వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ విష్ణు కంటే మనోజ్ కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. విష్ణుపై కొందరు కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. మంచు ఫ్యాన్స్ మాత్రం ఈ గొడవలు త్వరగా సమసిపోవాలని కోరుకుంటున్నారు.

మంచు ఫ్యామిలీకి చెందిన ఏ ఇష్యూ అయిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. గతంలో సన్నాఫ్ ఇండియా సినిమా సందర్భంగా మంచు లక్ష్హితో పాటు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విష్ణు ట్రోలర్స్ పై మండి పడ్డారు. కానీ మంచు మనోజ్ మాత్రం హుందాగా ట్రోల్ ఇక ఆపండి.. అంటూ ప్రాథేయపడ్డారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటపెడుతూ హల్ చల్ చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper