Prabhas cameo in Kannappa: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్లే కావడం విశేషం…ఇక సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక వీళ్లతో పాటుగా మోహన్ బాబు కూడా విలక్షణమైన నటుడిగా ఎదగడమే కాకుండా కొన్ని సినిమాలను చేసి స్టార్ హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నం అయితే చేశాడు. మరి మొత్తానికైతే ఆయన చేసిన సినిమాలు తనకి మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇక మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ లు మాత్రం ఏ మాత్రం సక్సెస్ లను సాధించలేకపోగా పూర్తిగా వెనుకబడిపోయారనే చెప్పాలి. వాళ్లకంటే వెనకాల వచ్చిన హీరోలు సైతం స్టార్ హీరోలుగా ఎదుగుతున్న క్రమంలో మంచు హీరోలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప (Kannappa) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. సినిమాకి దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టారట. ఇక అవి రికవరీ అవ్వడం కష్టమే అంటున్నారు. ప్రభాస్(Prabhas) కూడా ఈ సినిమాలో ఒక భాగమైనప్పటికి ప్రభాస్ వల్ల కొంతవరకు ఓపెనింగ్స్ అయితే వచ్చాయి.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ మూవీ లో నటించనున్న ఎన్టీఆర్ హీరోయిన్…
కానీ లాంగ్ రన్ లో ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ తెప్పించి ఈ మూవీని సూపర్ సక్సెస్ గా నిలబెట్టులేక పోయాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఇక మంచు విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అని వేచి చూసిన చాలామంది మంచు ఫ్యామిలీ అభిమానులు సైతం కొంతవరకు నిరాశ చెందుతున్నారనే చెప్పాలి.
అయితే సినిమా బాగుంది అని సాటిస్ఫై అవుతున్నప్పటికి ఈ మూవీని రిపీటెడ్ గా చూసే జనాలు మాత్రం కరవయ్యారు. దానివల్ల ఈ సినిమాకు భారీ దెబ్బ అయితే పడింది. మొత్తానికైతే ఈ సినిమాని చూసిన చాలామంది సెలబ్రిటీస్ మంచు విష్ణు నటన మీద పొగడ్తల వర్షం కురిపించారు. కానీ అవేవీ కూడా ఈ సినిమాను లాంగ్ రన్ లో సక్సెస్ ఫుల్ గా నిలబెట్టలేకపోతున్నాయి.
Also Read: సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను తన కాంపౌండ్ కే పరిమితం చేయనున్నారా..?
ఒక రకంగా చెప్పాలంటే మంచు విష్ణు ఇప్పటి వరకు చేసిన సినిమాలకంటే ఈ సినిమా చాలా బెటర్ కానీ కొన్ని నష్టాలను మిగులుస్తుందనే చెప్పాలి. ఈ సినిమా వల్ల మంచు ఫ్యామిలీ మీద ఉన్న నెగెటివిటీ కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. అలాగే వీళ్లను ట్రోల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. మరి రాబోయే సినిమాలతో మంచి విష్ణు మంచి పేరు సంపాదించుకోవడానికి ఈ సినిమా చాలా వరకు ఉపయోగపడుతుందనే చెప్పాలి…