Mohan Babu about Kannappa: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మార్కెట్ కి మించి పదింతలు ఎక్కువ ఖర్చు చేసి మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించాడు. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తాయని అనుకున్నాడు కానీ, కేవలం ఆయన మార్కెట్ కి తగ్గట్టుగానే వచ్చాయి. ఒకవేళ విష్ణు చెప్తున్నట్టు ఈ చిత్రానికి 200 కోట్లు నిజంగా ఖర్చు చేసి ఉండుంటే నిర్మాతకు భారీ నష్టాలు మిగిలాయని అనుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్స్ పై సోషల్ మీడియా లో ట్రోల్స్ భారీగా వస్తున్నాయి. అయితే మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) రీసెంట్ గా ఈ సినిమా ఫలితం పై సోషల్ మీడియా లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని మేము కమర్షియల్ గా డబ్బులు సంపాదించుకోవడం కోసం తీయలేదు. ఆ పరమశివుడి మీద భక్తితో తీసాము. సోషల్ మీడియా లో ఈ సినిమా పై అదే పనిగా విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారని నా దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వారిని నేను పట్టించుకోను. విమర్శ- సద్విమర్శ , ప్రకృతి – వికృతి ఇలా రెండు ఉంటాయి. ఒక పెద్దాయన ఏమన్నాడంటే గత జన్మలో మీరు తెలిసీతెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే, ఈ జన్మలో మీ గత జన్మ పాపకర్మలను విమర్శించేవాళ్ళు తీసుకెళ్తున్నారని అర్థం అన్నాడు. కాబట్టి వారిని ద్వేషించడం కానీ, శిక్షించడం కానీ చేయకండి, ఆశీర్వదించండి అని అన్నాడు. అందుకే వాళ్ళ గురించి నేనేమి మాట్లాడను, వాళ్ళ కుటుంబ సభ్యులంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.
Also Read: పవన్ కళ్యాణ్ కే ఎసరు పెడుతున్న ఎన్టీఆర్…
ఇక కన్నప్ప విషయానికి వస్తే మంచు విష్ణు గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఆయన గత చిత్రం జిన్నా వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేదు. కానీ కన్నప్ప చిత్రం దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా లో ప్రభాస్, మోహన్ లాల్ మరియు అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ సూపర్ స్టార్స్ నటించడం బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు లో ప్రభాస్ కారణంగా ఈ సినిమాకు వీకెండ్ లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆయన క్యారక్టర్ సినిమా మొత్తం పెట్టి ఉండుంటే ఇంకా కాస్త ఎక్కువ వసూళ్లు వచ్చేవి ఏమో. ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇంకా ఎవ్వరూ కొనుగోలు చేయలేదు.