Kannappa Hard Disk Gone : మంచు విష్ణు (Vishnu) హీరోగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప (Kannappa)…దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకున్నప్పటికి ఈ సినిమాలో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ అయితే చెప్పబోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ ని కొందరు దొంగిలించారు అంటూ మంచు విష్ణు (Vishnu) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగానే ఆ హార్డ్ డిస్క్ మిస్ అయిందా? లేదంటే కావాలనే ప్రమోషన్స్ కోసం హార్డ్ డిస్క్ మిస్సయిందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలను స్ప్రెడ్ చేయిస్తున్నారా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమాకి భారీ గుర్తింపైతే వచ్చింది. ఇక దాంతో పాటుగా ప్రభాస్ (Prabhas) ఈ సినిమాకి కూడా హాజర్వబోతున్నాడు అంటూ కొన్ని వార్తలయితే వస్తున్నాయి. ఇక ఇండియాలో ఉన్న స్టార్ యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో నటిస్తుండటం ఈ సినిమాకు భారీగా ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఏది ఏమైనా కూడా ఈ మూవీలో ప్రభాస్ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఈ సినిమాని చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆయన కనక ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించినటైతే ఈ సినిమా ఆటోమేటిక్ గా విజయాన్ని సాధిస్తోంది.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
పెట్టిన పెట్టుబడు లను కూడా రాబడుతుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి మంచు విష్ణు ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ ను కూడా చేపట్టే పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈనెల లోనే ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. మరి మంచు విష్ణు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడా? లేదంటే ఈ సినిమాతో మరోసారి మరో ఫ్లాప్ ని మూటకట్టుకుంటాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…