
Dil Raju: ఒక సినిమా తీయడానికి కనీసం ఆరునెలల పాటు కొన్ని వందల మంది తీరికలేని శ్రమ. వీరందరూ ముందుకెళ్లడానికి డబ్బులు పెట్టే నిర్మాత.. మరోవైపు ఎక్కడా తప్పు దొర్లకుండా చూసుకునే డైరెక్టర్.. శారీరకంతోపాటు మానసికంగా ప్రతి ఒక్కరు వేదన పడితేనే సినిమా పూర్తవుతుంది. ఇలాంటి సినిమాను కేవలం మూడు గంటల పాటు చూసిన సగటు ప్రేక్షకుడు సినిమా గురించి చెబుతారు. ఇలా ఉంది.. అలా ఉంది.. ఇంకా చేస్తే బావుండు.. అని. అయితే ప్రతి సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ ముందు ఓ బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ సినిమా ఎలా ఉందో ముందే చెబుతుంది. ‘ఆ..సినిమా దొబ్బింది రా అంటూ.. బయటకు వస్తారు.. కానీ వీళ్ల కోసం కాదు సినిమాలు తీసేది..’ అని దిల్ రాజు ఇటీవల కామెంట్స్ చేసి ఆకట్టుకున్నారు. ఒక సినిమా తీయడానికి ఎంత శ్రమపడుతారో ఆయన మాటల్లోనే..
‘మేం ఒక సినిమా తీసే ముందు ప్లాన్ వేస్తాం. ఒక్కోసారి ఆ ప్లాన్ ఫెయిల్ కావొచ్చు.. సక్సెస్ కావొచ్చు.. అయితే కథ బాగుంటే ప్రేక్షకులు వద్దన్నా థియేటర్లకు వస్తారు. బలగం సినిమా కోసం నేను ఫైనాన్స్ చేశా.. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఒటీటీలో రిలీజైనా థియేటర్లకు వస్తున్నారు. సినిమా పూర్తి కావడానికి శారీరక శ్రమతో పాటు ఎంతో మంది కష్టం ఉంటుంది. ఇప్పుడు గుణశేఖర్ తీయబోయే సినిమా బాగా నచ్చింది. అందుకే ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నా’ అని అన్నారు.

గుణశేఖర్ డైరెక్షన్లో సమంత మెయిన్ రోల్ లో వస్తున్న ‘శాకుంతల’ నిర్మీతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే వీఎఫ్ఎక్స్, తదితర ఎఫెక్ట్స్ కోసం సినిమా ఆలస్యమవుతుందన్న చర్చలు సాగుతున్నాయి. అయితే దిల్ రాజు సపోర్టుతో ఇటీవల ఈ మూవీకి సంబంధించిన త్రీడీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజుతో పాటు గుణశేఖర్ మాట్లాడారు.
ఈవెంట్ సందర్భంగా కొందరు అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానం ఇచ్చారు. ‘నేను ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’ అని అన్నారు. దీంతో అక్కడున్న మరొకరు కలుగజేసుకొని ‘30 సినిమాలు తీశారుగా కొత్తగా ఏం నేర్చుకున్నారు? ’ అని అడగగా.. గుణశేఖర్ కల్పించుకొని ‘ఆయన నిత్య విద్యార్థి.. నేర్చుకుంటూనే ఉంటారు’ అని రిప్లై ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.. మీరూ చూడండి..