Kannappa Collections:మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తన మార్కెట్ కి మించి పదింతలు ఖర్చు చేసి నిర్మించిన కన్నప్ప(Kannappa Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఎవ్వరూ ఊహించని రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది సాధారణంగా, ఆయన రేంజ్ మార్కెట్ కి తగ్గట్టు తీసి ఉండుంటే కచ్చితంగా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ అలా జరగలేదు. ఈ చిత్రానికి బడ్జెట్ 200 కోట్లు ఖర్చు అయ్యింది, త్వరలో విడుదల కాబోతున్న ‘రాజా సాబ్’, ‘ఓజీ’ చిత్రాలకంటే ఈ చిత్రానికే ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయ్యిందని మంచు విష్ణు పలు ఇంటర్వ్యూస్ లో స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆయన పై విడుదలకు ముందు IT రైడ్స్ కూడా జరిగాయి. అయితే మార్కెట్ వేల్యూ ప్రకారం ఈ చిత్రానికి 81 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
Also Read: కింగ్ డమ్ సినిమా విజయ్ కెరియర్ ను డిసైడ్ చేస్తుందా..?
థియేట్రికల్ రన్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పూర్తి అయ్యింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మంచు విష్ణు గత చిత్రాలకు వరల్డ్ వైడ్ గా కూడా ఈ రేంజ్ క్లోజింగ్ వసూళ్లు రాలేదు. తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తీసి ఉండుంటే ఈ సినిమా కచ్చితంగా మంచు విష్ణు కెరీర్ లో మరో భారీ హిట్ గా నిల్చి ఉండేది. ఇక మిగిలిన ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లను చూస్తే సీడెడ్ లో రెండు కోట్ల 60 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో రెండు కోట్ల 30 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో కోటి 30 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 90 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
Also Read: అందం లో మహేష్ బాబు తో పోటీపడే హీరో తెలుగులో ఒకరున్నారు…కానీ సక్సెస్ లు మాత్రం లేవు…
అదే విధంగా కృష్ణ జిల్లాలో 85 లక్షలు, నెల్లూరు జిల్లాలో 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, వరల్డ్ వైడ్ గా పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా+ డబ్బింగ్ వెర్షన్స్ కలిపి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మంచు విష్ణు సినిమాకు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవర్సీస్ లో దాదాపుగా 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఓవరాల్ గా చూసుకుంటే నిర్మాత కు 56 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఓటీటీ రైట్స్ ఇంకా అమ్మలేదు. అమ్మితే కాస్త రికవరీ అవ్వొచ్చు.