Kannappa : నేడు ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయ్యింది అంటూ సోషల్ మీడియా లో వచ్చిన వార్త ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముంబై లోని ఒక ప్రముఖ VFX కంపెనీ తో సుమారుగా గంటన్నర నిడివి ఉన్న సినిమాకు VFX వర్క్ చేయించారు. ఆ ఫుటేజీ మొత్తాన్ని ఒక హార్డ్ డ్రైవ్ లో పెట్టి మంచు విష్ణు(Manchu Vishnu) కి కొరియర్ ద్వారా పంపగా ఆఫీస్ బాయ్ రఘు ఆ హార్డ్ డ్రైవ్ ని మాయం చేసి పరారు అయ్యాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మాయమైన హార్డ్ డ్రైవ్ లో ఎక్కువ శాతం ప్రభాస్(Rebel Star Prabhas) కి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాపై జనాలు నేడు కాస్తో కూస్తో మాట్లాడుకుంటున్నారంటే, అందుకు కారణం ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఈ చిత్రం లో భాగం కావడం వల్లే.
ప్రభాస్ లేకుంటే ఈ సినిమా గురించి ఎవ్వరూ మాట్లాడుకునే వాళ్ళు కాదు అనేది వాస్తవం. అలాంటి ప్రభాస్ ఉన్న సన్నివేశాలే మిస్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కుట్ర వెనుక మంచు మనోజ్ వర్గం ఉందని మంచు విష్ణు వర్గం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రఘు, చరిత వంటి వాళ్ళు మనోజ్ ఆఫీస్ కి చెందిన వాళ్ళని, హార్డ్ డ్రైవ్ కొరియర్ ద్వారా ఇంటికి వచ్చినప్పుడు విష్ణు వ్యక్తిగత సిబ్బందికి ఆ కొరియర్ చేరనివ్వకుండా చేసింది వీళ్ళిద్దరే అని అంటున్నారు. గడిచిన కొద్దినెల నుండి మంచు కుటుంబం లో జరుగుతున్న వివాదాలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. వదిలితే ఒకరినొకరు చావబాదుకునేలా ఉన్నారు మనోజ్, విష్ణులు. ఈ నేపథ్యంలోనే మనోజ్ ఈ పని చేయించి ఉంటాడని అందరు అనుకుంటున్నారు. ఇందులో నిజా నిజాలేంటో తెలియాల్సి ఉంది.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
ఇది విషయాన్ని పక్కన పెడితే కాసేపటి క్రితమే మంచు విష్ణు వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ‘జటాజూటధారీ..నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ’ అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసాడు. ఇది సినిమాలోని డైలాగ్ అయ్యుండొచ్చు, కానీ సందర్భానికి తగ్గట్టుగా వేయడం తో బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా హార్డ్ డ్రైవ్ మిస్ అయిన వ్యవహారం నిజమనేనని మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మరి ఈ విషయం ఎప్పుడు సర్దుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని వచ్చే నెల 27 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి ఈ ఘటన తర్వాత వాయిదా పడుతుందా లేదా అనేది చూడాలి. ఈ చిత్రం లో ప్రభాస్ తో అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.