ఆ..! అయినా ఈ కాలంలో సిగ్గూ ఎగ్గూ ఏమిటయ్యా.. అంతా ఓపెన్.. మునుపటిలా పెళ్లిలో వధువు సిగ్గుపడడం లేదు.. వరుడు బుద్దిగా కూర్చోవడం లేదు అంతా దేత్తడి పోచమ్మ గుడినే. పెళ్లి అంటేనే వధువు, వరుడు బంధువులంతా అంతా జోష్ తో మందు విందులు, డ్యాన్సులతో రెచ్చిపోతున్నారు. ఈ కాలం యువత అసలు సిగ్గుపడడం మానేసి ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: బరాత్ చోరీలు.. ఒక్కరికి రూ.12 లక్షలు
మహారాష్ట్రలో ఓ వధువు సన్నీలియోన్ ‘మేరే సైయాన్ సూపర్ స్టార్ క్రేజీ’ పాటకు చిందులేసింది. మరాఠి సంప్రదాయం ప్రకారం రెడీ అయ్యి సన్ గ్లాసెస్ పెట్టుకొని గ్రాండ్ గా మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది.
సన్నీలియోన్ పాట వేసుకొని డ్యాన్స్ చేస్తూ పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది.. పెళ్లికూతురు వీర లెవల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తుంటే స్టన్ అయిపోయిన పెళ్లికొడుకు వేదికపై అలా కళ్లప్పగించి చూస్తుండిపోయాడు. ఈ ఉదంతం మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
Also Read: 24 గంటల్లో కరోనా వైరస్ కు చెక్.. వెలుగులోకి కొత్త ఔషధం..?
ఈ హఠాత్ పరిణామానికి పెళ్లికి హాజరైన బంధువులంతా ఆశ్చర్యపోగా.. పెళ్లి కొడుకు సైతం కొద్దిసేపు అలా స్టన్ అయిపోయాడు.త రువాత తేరుకొని పెళ్లికూతురుకు ముద్దు ఇచ్చి వేదికపైకి తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
आवडलेलं ❤️ pic.twitter.com/AeziuDdiu6
— Praveen Gavit (@praveengavit10) December 2, 2020