Tollywood Avengers : హాలీవుడ్ లో లాగా మన టాలీవుడ్ లో కూడా ‘అవెంజర్స్'(Avengers) లాంటి సిరీస్ చేస్తే ఎలా ఉంటుంది?. ఈమధ్య కాలం లో లోకేష్ కనకరాజ్ వంటి వాళ్ళు సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇదంతా హాలీవుడ్ నుండి ప్రభావితమై తెచ్చినదే. సినిమాటిక్ యూనివర్స్ అంటే ఒక సినిమాకు మరో సినిమాకు లింక్ ఉండడం. అలా చేయడం వల్ల మల్టీ స్టార్రర్ చిత్రం గా మారిపోతూ ఉంటాయి. అలా హాలీవుడ్ లో స్పై డర్ మ్యాన్ , ఐరన్ మ్యాన్, హల్క్, యాంటీ మ్యాన్, కెప్టెన్ అమెరికా, కెప్టెన్ మర్వెల్ ఇలా సూపర్ హీరోస్ అందరూ కలిసి చేసిన చిత్రమే ‘అవెంజర్స్’. ఇలా మన టాలీవుడ్ టాప్ 6 హీరోలతో డైరెక్టర్స్ ఇలా సూపర్ హీరోస్ సినిమాటిక్ యూనివర్స్ ని ఎందుకు క్రియేట్ చేయకూడదు?, ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ కి తగ్గ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి కదా? అని అభిమానుల్లో ఉండే కోరిక.
ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా మనం ఇలాంటి సినిమాని చూడొచ్చు. అయితే అభిమానులు అప్పటి వరకు ఆగలేరు కదా, అందుకే AI ని ఉపయోగించి స్పెషల్ ఎడిటింగ్ వీడియోస్ కొన్ని చేసారు. వాటిల్లో బాగా పేలిన ఒక వీడియో ని మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ వీడియో లో మహేష్ బాబు(Superstar Mahesh Babu) కెప్టెన్ అమెరికా గా కనిపించగా, రామ్ చరణ్(Global Star Ram Charan) ఐరన్ మ్యాన్ గా, అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హల్క్ గా, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) యాంట్ మ్యాన్ గా కనిపించాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఈ ఆలోచన ఎడిటింగ్ రూపం లో చూస్తేనే ఇంత బాగుంది, ఇక సినిమాగా చూస్తే ఏ రేంజ్ లో ఉంటుందో?, భవిష్యత్తులో ఇది సాధ్యం అవుతుందా లేదో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.