Sreeleela : ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు కిరీటి రెడ్డి(Kireeti Reddy) ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ నటించిన చిత్రం ‘జూనియర్’. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పోస్టర్లే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అందించిన మ్యూజిక్ హైలైట్ అనే చెప్పాలి. శ్రీలీల(Sreeleela) హీరోయిన్ అవ్వడం మరో బిగ్గెస్ట్ పాజిటివ్. వీళ్ళిద్దరే ఈ సినిమా పై కాస్త అంచనాలు పెంచేలా చేశారు. రీసెంట్ గా విడుదల చేసిన ‘వైరల్ వయ్యారి'(Viral Vayyari) పాట ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట లో శ్రీలీల వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో తెగ ట్రెండ్ అవుతుంది. కుర్రాళ్ళు ఎక్కడ చూసినా ఈ పాటలోని స్టెప్పులు వేస్తూ రీల్స్ ని అప్లోడ్ చేస్తున్నారు.
ఇవి పైడ్ రీల్స్ నా?, లేకపోతే సహజం గానే ఇన్ని రీల్స్ వస్తున్నాయా అనేది కాసేపు పక్కన పెడితే, సాంగ్ మాత్రం మంచి క్యాచీ గా ఉంది. శ్రీలీల స్టెప్పులు నిజంగానే అదిరిపోయాయి. చాలా కాలం తర్వాత ఆమెకు మంచి డ్యాన్స్ నెంబర్ పడిందని అనుకోవచ్చు. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్(Shivarajkumar) ముఖ్య అతిథిగా విచ్చేశాడు. స్టేజి మీదకు ఆయన వచ్చినప్పుడు మూవీ టీం ‘వైరల్ వయ్యారి’ పాటలోని హుక్ స్టెప్పులు వెయ్యమని శివ రాజ్ కుమార్ ని రిక్వెస్ట్ చేయగా, ఆయన వాళ్ళ రిక్వెస్ట్ ని మన్నించి హీరో కిరీటి, హీరోయిన్ శ్రీలీల తో కలిసి స్టెప్పులు వేశాడు. ఆయన స్టెప్పులు వేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ వయస్సులో కూడా శివన్న కుర్రాళ్లను డామినెటే చేసే విధంగా డ్యాన్స్ వేస్తున్నదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శివన్న కన్నడ చలన చిత్ర పరిశ్రమ లో మంచి డ్యాన్సర్ల లిస్ట్ తీస్తే నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. ఆయన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ కూడా అద్భుతమైన డ్యాన్సర్. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఆయన మనతో లేడు కానీ, కన్నడ సినీ ఇండస్ట్రీ లో వీళ్లిద్దరు చిరంజీవి,పవన్ కళ్యాణ్ లాగా అన్నమాట. ప్రస్తుతం శివ రాజ్ కుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
#ShivaRajkumar joins #Kireeti and #Sreeleela for the ‘Viral Vayyari’ hook step at the #Junior pre-release event in Bengaluru. pic.twitter.com/0KW73jAVWy
— Gulte (@GulteOfficial) July 13, 2025