Bhola Shankar : చాలా కాలం నుండి సెట్స్ మీద ఉన్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu) చిత్రం ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. గడిచిన వారం రోజుల నుండి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. నేడు ఈ చిత్రానికి సంబంధించిన మూడవ పాట ని విడుదల చేశారు. ఈ పాటకు ఇంతకు ముందు విడుదలైన రెండు పాటలకంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశానికి బ్యాక్ గ్రౌండ్ గా ఈ పాట ఉండబోతుంది. ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ఈవెంట్ ని నిర్మాత AM రత్నం నిర్వహించాడు. ఎన్నడూ లేని విధంగా తెలుగు, హిందీ, తమిళం యాంకర్స్ ఒకే స్టేజిని పంచుకుంటూ హోస్టింగ్ చేయడం గమనార్హం.
ఇకపోతే ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత AM రత్నం(AM Ratnam) మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సినిమా విడుదల తేదికి, మా ప్రమోషనల్ కార్యక్రమాలకి చాలా తక్కువ సమయం ఉంది. మీడియా మిత్రులు మాకు సహకరించాలి. కాసేపటి క్రితమే మీరు ‘అసుర హననం’ పాట ని చూసి ఉంటారు. ఈ పాటనే ట్రైలర్ లో రేంజ్ లో ఉంది కదూ. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. వాస్తవానికి నేను కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారితో ఖుషి తర్వాత ఆయన దర్శకత్వం లో ‘సత్యాగ్రహి’ చిత్రం చెయ్యాలని అనుకున్నాము. పూజా కార్యక్రమాలు కూడా అప్పట్లో మొదలు పెట్టాము. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ‘హరి హర వీరమల్లు’ కి బదులుగా మేము తమిళం లో సూపర్ హిట్ అయిన వేదలమ్ చిత్రాన్ని రీమేక్ చేయాల్సింది’.
‘కానీ ఆ సమయంలోనే డైరెక్టర్ క్రిష్ నా దగ్గర ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ఉంది, కళ్యాణ్ గారిని కలిపిస్తే ఈ స్టోరీ ని వినిపిస్తాను అన్నారు. ఆయన వద్దకు తీసుకెళ్లి స్టోరీ ని వినిపించిన తర్వాత చాలా థ్రిల్ కి గురయ్యారు. మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అలా ఈ చిత్రం మొదలైంది’ అంటూ నిర్మాత AM రత్నం మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే రత్నం వేదలమ్ టాపిక్ తెచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు భయపడిపోయారు. ఎందుకంటే ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్ గా నిల్చిన చిత్రమది. భలే తప్పించుకున్నాము అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.