Homeట్రెండింగ్ న్యూస్Chhattisgarh: 20 ఏళ్ల కింద హత్య.. వెంటాడి వేధిస్తున్న ఆత్మ..!

Chhattisgarh: 20 ఏళ్ల కింద హత్య.. వెంటాడి వేధిస్తున్న ఆత్మ..!

Chhattisgarh
Chhattisgarh

Chhattisgarh: నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే కథనేనే.. అంటూ అంతస్తులు అనే పాత సినిమా కోసం ఓ రచయిత పాట రాశాడు. అప్పట్లో ఈ పాట సూపర్‌ డూపర్‌ హిట్‌. ఒక ఆత్మ వెంటాడున్న దృశ్యాన్ని ఈ సినిమాలో చూపించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో అచ్చం అలాగే జరుగుతోంది. 20 ఏళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి ఆత్మ ఇపుటికీ హంతకుడిని వెంటాడుతోందట. కలలోకి వచ్చి హింసిస్తోందట. సినిమాల్లో మాత్రమే మనం చూసే ఈ ఘటన నిజం కావడం కలకలం సృష్టిస్తోంది.

2003లో హత్య..
ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్‌ కరక్‌భాట్‌ ప్రాంతానికి చెందిన టికం కొలియారా.. 2003లో తాను ఛవేశ్వర్‌ గోయల్‌ అనే వ్యక్తిని హత్య చేసి అడవిలో పాతిపెట్టానని గ్రామస్తులకు గతేడాది తెలిపాడు. అతడు తన భార్యకు స్నేహితుడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో హతమార్చానని పేర్కొన్నాడు. అయితే ఛవేశ్వర్‌ ఇప్పుడు తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని వెల్లడించాడు. ఈ వ్యవహారంలో కొలియారాపై పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా తవ్వకాలు చేపట్టారు.

Chhattisgarh
Chhattisgarh

దొరకని మృతదేహం..
కొలియారా చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. ఎంత వెతికినా పోలీసులకు మాత్రం మృతదేహం దొరకలేదు. దీంతో కొలియారా మానసిక ఆరోగ్యం బాగాలేదని అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. కానీ ఛవేశ్వర్‌ తండ్రి పట్టువిడవలేదు. మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు.. బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టారు. ఓ డ్యామ్‌ పక్కన జరిపిన తవ్వకాల్లో కొన్ని ఎముకలు, వస్త్రాలను గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఎముకలను ప్రయోగశాలకు పంపారు.

కనిపించకుండా పోయిన కొలియారా..
మృతదేహం దొకనంత వరకు పోలీసుల అదుపులో ఉన్న కొలియారా.. ఎముకలు దొరికిన తర్వాత కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులను అడిగినా తమకూ ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. చంపేసిన వ్యక్తి ఛవేశ్వర్‌ నిత్యం కలలోకి వచ్చి హింసిస్తున్నాడని చెప్పిన కొలియారా ఏమయ్యాడన్న ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది.

ఆత్మలు వెంటాడతాయా..
ఇదిలా ఉంటే.. కొలియారా చెప్పినట్లు ఆత్మలు వెంటపడతాయా అన్న చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. ఆత్మలే లేవని, మానసిక సమస్యతోనే కొంతమంది వింతగా ప్రవర్థిస్తారని శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దెయ్యం, ఆత్మల గురించిన భయం తొలగిపోలేదు. దీంతో ఛవేశ్వర్‌ ఆత్మ కొలియారాను వెంటాడడం నిజమే అని కరక్‌భాట్‌ వాసులు భావిస్తున్నారు. కొలియారాను ఆత్మ అంతం చేసిందా అని చర్చించుకుంటున్నారు. అయితే 20 ఏళ్ల తర్వాత కూడా ఆత్మ వెంటాడడం ఆశ్చర్య కలిగిస్తోంది. హత్య చేశానన్న భావనతోనే కొలియారా మానసిక సమస్య మొదలై అది క్రమంగా ఎక్కువై ఉంటుందని వైద్యులు, మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మ వెంటాడింది అనే వాదనను కొట్టిపారేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular