Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో వీరు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. వీరిలో ఆరుగురిపై రూ. 25 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడించారు. వీరు లొంగిపోవడంతో స్ఠానిక కెర్లపెండ గ్రామం నక్సల్ రహిత గ్రామంగా మారినట్లు పోలీసులు వివరించారు. ఇటీవల భద్రతాబలగాల ఎదరుకాల్పుల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నే మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిపిపోతున్నారు.