Chhattisgarh Encounter: గత మూడు రోజులుగా నేషనల్ పార్క్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్, భాస్కర్ మృతి చెందారు. సుధాకర్ పై రూ కోటి, భాస్కర్ పై రూ 25 లక్షల రివార్డ్ ఉంది ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని భద్రతా బలగాలు వెల్లడించాయి. తాజాగా బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్ట్ లో జరుగుతున్న ఆపరేషన్ లో మూడో రోజు మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతి చెందారు. వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలం నుంచి పెద్దఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.