spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni: ఈ సినిమా తర్వాత నా పరిస్థితి ఏంటో అని భయం వేస్తుంది..'ఏజెంట్' ప్రీ...

Akhil Akkineni: ఈ సినిమా తర్వాత నా పరిస్థితి ఏంటో అని భయం వేస్తుంది..’ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ షాకింగ్ కామెంట్స్

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వరంగల్ లో ఘనంగా జరిగింది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా హాజరయ్యాడు. అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్నీ అడ్డంకులను దాటుకొని ఈ నెల 28 వ తారీఖున విడుదల కాబోతుంది.’సై రా నరసింహా రెడ్డి’ సినిమా తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఇది.

ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అక్కినేని అఖిల్ ని చాలా స్టైలిష్ గా మరియు వైల్డ్ గా చూపించాడు సురేందర్ రెడ్డి. కచ్చితంగా థియేటర్ లో చూసే ఆడియన్స్ మరియు ప్రేక్షకులకు కూడా వైల్డ్ అనుభూతి కలుగుతుంది అనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్.

Akhil Akkineni
Akhil Akkineni

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో అక్కినేని అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముందుగా ఈ సభకి అతిథులుగా విచ్చేసిన అందరికి కృతఙ్ఞతలు తెలియచేస్తూ అఖిల్ ప్రసంగం ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతూ ‘సురేందర్ రెడ్డి గారు, మన ఇద్దరం కలిసినప్పుడు క్రేజీ గా ఎదో ఒకటి చేద్దాం అని అనుకున్నాము.అనుకున్నట్టు గానే ఎదో చేసాము సార్, ఈ సినిమా తర్వాత నేను తర్వాత ఏమైపోతానో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్ లో నన్ను చూపించేసారు,దీనికి మించి నేను ఏమి చెయ్యగలను అని అనిపిస్తుంది. ఇక నేను ప్రత్యేకించి థాంక్స్ చెప్పుకోవాల్సింది మమ్మూటీ గారికి. అలాంటి లెజెండ్ తో కలిసి నటించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.ఆయన మామూలుగా ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ చెయ్యడానికి ఒప్పుకోరు, కానీ ఈ కథని ని నచ్చి వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను సార్’ అంటూ అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Jagan

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...
Tanuja

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Tollywood Heroes

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవికి కూటమి కీలక బాధ్యతలు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం పెద్ద ఆఫర్ చేసిందా? పెద్ద బాధ్యత ఆయనపై మోపిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది....
Oktelugu Epaper