spot_img
Homeఎంటర్టైన్మెంట్Hero Nani: హీరో నాని వాళ్ళను ప్రాధేయపడ్డాడా?

Hero Nani: హీరో నాని వాళ్ళను ప్రాధేయపడ్డాడా?

Hero Nani
Hero Nani

Hero Nani: హీరో నానికి ఎన్నడూ చూడని సప్పోర్ట్ దక్కుతుంది. బడా స్టార్స్, డైరెక్టర్స్ ఆయన సినిమాకు ప్రచారం కల్పిస్తున్నారు. హీరో నాని మీద వాళ్లకు ఇంత అభిమానం ఏమిటో అర్థం కావడం లేదు. దర్శకుడు రాజమౌళి మన అనుకున్న వాళ్ళ సినిమాలు తప్పితే ఇతరుల సినిమాలు ప్రమోట్ చేయరు. లేదా ప్రత్యేకంగా ఆయన్ని అడగాలి. రాజమౌళి దసరా మూవీ అద్భుతం అంటూ కామెంట్ చేశాడు. నానితో గతంలో రాజమౌళితో ఈగ మూవీ చేశారు. అప్పటి నుండి మంచి బాండింగ్ మైంటైన్ చేస్తున్నాడు.

నాని హీరోగా నటించిన మజ్ను మూవీలో రాజమౌళి చిన్న క్యామియో రోల్ చేయడం విశేషం. బాహుబలి 2 సెట్స్ లో దర్శకుడిగా తన నిజ పాత్రలో కనిపించాడు. ఇక దసరా మూవీ గొప్పగా ఉందంటూ నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఓదెలను పొగుడుతూ ఓ ట్వీట్ వేశారు. ఇది నార్త్ ఆడియన్స్ కి సినిమా మీద ఆసక్తి రేపేందుకు ఉపయోగపడుతుంది. దసరాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఇతర భాషల్లో అంతంత మాత్రమే. నైజాం, ఓవర్సీస్లో మాత్రమే దసరా భారీ వసూళ్లు రాబట్టింది. చివరికి ఆంధ్రాలో కూడా ఏమంత ఆశాజనకంగా లేవు.

ఈ క్రమంలో దసరా చిత్రాన్ని లేపేందుకు టాప్ స్టార్స్ రంగంలోకి దిగారు. దసరా సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దసరా గర్వించదగ్గ చిత్రం అంటూ మహేష్ ట్వీట్ చేశారు. సినిమా తనకు బాగా నచ్చిందని వెల్లడించారు. కొన్నాళ్లుగా మహేష్ ఇతర హీరోల సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందించడం మానేశారు. చాలా గ్యాప్ తర్వాత నానికి మేలు చేశాడు. ఇక ప్రభాస్ ట్వీట్ చేయడం ఊహించని పరిణామం. ఇది ఖచ్చితంగా అడిగి వేయించుకున్న ట్వీటే.

Hero Nani
Hero Nani

ప్రభాస్ ఇవన్నీ పట్టించుకోరు. ఒక సినిమా నచ్చినా ఆయన సోషల్ మీడియాలో రివ్యూలు ఇవ్వరు. అలా అని ఇతర హీరోల సినిమాలు ఆయనకు నచ్చవని కాదు. ఆయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. అడ్మిన్స్ ఆయన పేజెస్ చూసుకుంటారు. తన చిత్రాలతో పాటు ఎవరైనా చిన్న సినిమా హీరోలు మద్దతు అడిగితే ట్రైలర్స్ విడుదల చేస్తుంటారు. అంతకు మించి ఆయన ఒక సినిమా బాగుందంటూ ట్వీట్ చేసిన సందర్భం లేదు.

మరి దసరా చిత్రం మీద ప్రత్యేకంగా స్పందించాడంటే ఆలోచించాల్సిన విషయమే. దసరా విజయం సాధించినా నాని అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. ఇతర భాషల్లో కూడా దసరా విజయం సాధించాలని, పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాలని ఆశపడ్డారు. అందుకోసమే దేశవ్యాప్తంగా తిరిగి దసరా చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. సౌత్ అండ్ నార్త్ మొత్తం కవర్ చేశాడు. కానీ ప్రయోజనం దక్కలేదు. కాంతార మాదిరి మ్యాజిక్ చేస్తుందనుకున్న ఆయన ఆశలు తీరలేదు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా వసూళ్లు డల్ గా ఉన్నాయి. దీంతో రాజమౌళి, ప్రభాస్, మహేష్ వంటి హీరోలతో నాని ప్రమోట్ చేయిస్తున్నారనిపిస్తుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper