
CM Jagan : గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ప్రతిపక్షాలు జగన్ సర్కారు ముందస్తుకు వెళ్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై పలు రకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో ఆశావహులకు నిరాశే మిగులుతోంది. మంత్రివర్గ మార్పులపై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. అందుకే ఐదేళ్లు పాలించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఏం జరుగుతోంది?
మరోవైపు ఏపీలో ఏం జరుగుతోంది? రాజకీయాల్లో ఏం జరుగుతోంది? పార్టీల చూపు ఎటు వైపు వెళ్తోంది? అనే విషయాలు ప్రజలకు అర్థం కావడం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని ప్రజలకు బాగుంటున్నా కొన్నింటిపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమే కానుందా? అనే కోణంలో పలు వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళతారా? ముందస్తుతో జగన్ కు లాభం కలుగుతుందా? అనే విషయంలో వైసీపీ ఆలోచన కొనసాగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఉండదని చెప్పారు. మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.
స్పష్టత ఇచ్చిన జగన్
ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని జగన్ మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం పూర్తి కాలం మనుగడలో ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహాలకు అస్కారం లేదు. ముందస్తుకు వెళ్లేది లేదు. ప్రజలకు ఐదు సంవత్సరాలు సేవ చేయడమే లక్ష్యం. తరువాతే ఎన్నికలు అని కుండ బద్దలు కొట్టారు. ఇన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ముందస్తు ఆలోచన లేదని వెల్లడించారు. కొద్ది రోజులుగా జగన ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారానికి తెర దించారు.
ముందస్తుతోనే జగన్ కు లాభమా?
ఇటీవల జరిపిన కొన్ని సర్వేల్లో జగన్ ముందస్తుకు వెళితేనే గెలుస్తారని చెబుతున్నాయి. 2024లో ఎన్నికలకు వెళితే టీడీపీకే ప్లస్ అవుతుందని వెల్లడించాయి. కానీ జగన్ మాత్రం ముందస్తుకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తాయని చెబుతున్నాయి. 2024లో ఎన్నికలు జరిగితే టీడీపీకి 46 శాతం, వైసీపీకి 41 శాతం ఓట్లు వస్తాయని తెలుస్తోంది. జనసేనకు 8 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి.