Tollywood Young Heros: నిజానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు యంగ్ హీరోలకి మంచి టాలెంట్ ఉన్నప్పటికి వాళ్ళకు సరైన అదృష్టం లేకనో, లేదంటే సరైన సినిమాలు పడకనో వాళ్లు ఇంకా మీడియం రేంజ్ హీరోలుగానే కొనసాగుతున్నారు. విల్లు ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు 15 సంవత్సరాల పైన అవుతున్నప్పటికి ఇండస్ట్రీలో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కూడా సాధించలేకపోతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు అంటే ఒకరు శర్వానంద్ (Sharvanand) కాగా, మరొకరు నాగచైతన్య (Naga Chaithanya)…
శర్వానంద్ విషయానికి వస్తే ఆయన ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పైన అవుతోంది. అయినప్పటికి ఆయనకి ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ కూడా లేదు. ఆయన కెరియర్ లో కొన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికి అవి కూడా అడపాదడపగా వస్తుండటం తో ఆయన కెరీర్ అనేది ఎప్పటికప్పుడు ప్రమాదంలోనే ఉంటుంది. తన మార్కెట్ విస్తరించుకోవాలనే ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆయన భారీగా డౌన్ అయిపోతున్నాడు. ఇంతకుముందు వేరే హీరోలతో సక్సెస్ లను అందుకున్న దర్శకులు ఆయన దగ్గరికి వచ్చేసరికి మాత్రం సక్సెస్ లను ఇవ్వకపోగా అతనికి భారీ డిజాస్టర్లను కట్టబెడుతున్నారు…
గడిచిన 10 సంవత్సరాలలో ‘రన్ రాజా రన్’ , ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ అనే రెండు సినిమాలను మినహాయిస్తే ఆయన చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ ని సాధించలేదు… నాని, నాగార్జున కాంబోలో దేవ్ దాస్ (Devdas) అనే సినిమా చేసిన శ్రీరామ్ ఆదిత్య (Sriram Adithya) ఆ సినిమాతో వాళ్ళకి ఒక మంచి సక్సెస్ ను అందించాడు. ఇక అదే ఊపులో శర్వానంద్ (Sharvanand) తో మనమే (Maname) అనే సినిమా చేశాడు.
ఆ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. సుధీర్ వర్మ (Sudeer Varma) లాంటి దర్శకుడు సైతం నిఖిల్ కి ‘స్వామి రారా’ , ‘కేశవ’ లాంటి రెండు సక్సెస్ ఫుల్ సినిమాలను తీశాడు. కానీ శర్వానంద్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం రణరంగం సినిమాతో అతనికి భారీ డిజాస్టర్ ను కట్టబెట్టాడు… అజయ్ భూపతి లాంటి దర్శకుడు సైతం ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తర్వాత శర్వా తో మహాసముద్రం అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది…
ఇక నాగచైతన్య విషయానికి వస్తే కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన సరైన సక్సెస్ లను సాధించడంలో చాలా వరకు ఇబ్బంది పడుతూనే వస్తున్నాడు. ఒక సక్సెస్ ని సాధిస్తే మరో డిజాస్టర్ వచ్చి పడుతుంది… నానితో ‘భలే భలే మగాడివోయ్’ లాంటి భారీ సక్సెస్ fup సినిమాను చేసిన మారుతి ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా డిజాస్టర్ అయింది… సుధీర్ వర్మ సైతం స్వామిరారా సినిమాతో మంచి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన ఆ తర్వాత చేసిన దోచేయ్ సినిమాతో ఈయనకు ఏ మాత్రం సక్సెస్ ని కట్టబెట్టలేకపోయాడు…
‘ప్రస్థానం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దేవకట్ట సైతం ఆ తర్వాత నాగచైతన్యతో చేసిన ఆటోనగర్ సూర్యతో డీలాపడ్డాడు…తమిళ్ డైరెక్టరైన వెంకట్ ప్రభు సైతం ‘మానాడు’ సినిమాతో శింబు కు ఎదురులేని స్టార్ డమ్ ను కట్టబెట్టాడు. కానీ కస్టడీ సినిమాతో నాగచైతన్య కి ఒక ఫ్లాప్ నైతే అందించాడు. ఇక దీన్ని బట్టి చూస్తే శర్వానంద్ కి నాగచైతన్యాలకు లక్కు లేదనే చెప్పాలి. ఇక దురదృష్టవంతులైన హీరోలు కూడా వీళ్లే అంటూ సోషల్ మీడియా లో వాళ్ళను ట్రోల్ చేస్తున్నారు…