Anchor Srimukhi : శ్రీముఖిని యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ గట్టిగా వాడేస్తున్నాడు. తన షోకి శ్రీముఖి గ్లామర్ ని పెట్టుబడిగా పెడుతున్నాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి హద్దులు దాటి అందాల ప్రదర్శన చేస్తుంది. ఓంకార్ నిర్మాతగా ఆహాలో డాన్స్ ఐకాన్ పేరుతో డాన్స్ రియాలిటీ షో ప్రారంభమైంది. ఈ షోకి జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, మోనాల్ గజ్జర్ అలాగే శ్రీముఖి వ్యవహరిస్తున్నారు. శ్రీముఖిని అటు యాంకర్ గా ఇటు జడ్జిగా ఉపయోగిస్తున్నారు. డాన్స్ ఐకాన్ కోసం శ్రీముఖి ధరిస్తున్న బట్టలు దారుణంగా ఉంటున్నాయి.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ప్రసారం అవుతున్న షో కావడంతో ఎలాంటి పరిమితులు లేవు. నిబంధనలున్న బుల్లితెరపైనే రెచ్చిపోయి స్కిన్ షో చేసే శ్రీముఖికి, డాన్స్ ఐకాన్ షోలో మరింత రెచ్చిపోయే ఛాన్స్ దక్కింది. సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ నెస్ లో బౌండరీలు దాటేస్తుంది. డాన్స్ ఐకాన్ షోలో శ్రీముఖి పొట్టి బట్టలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ పేలుతున్నాయి. అవేమీ పట్టించుకోని ఈ యంగ్ యాంకర్ అంతకంతకూ డోసు పెంచుకుంటూ పోతుంది.

కాగా శ్రీముఖి తెగింపుకు కారణం ఓంకార్ అంటున్నారు. డాన్స్ ఐకాన్ షోకి పాపులారిటీ, వ్యూవర్షిప్ తేవడం కోసం శ్రీముఖి బట్టల సైజ్ తగ్గించేశాడు అంటున్నారు. శ్రీముఖి ధరించే హాట్ ట్రెండీ వేర్ సెలక్షన్ పూర్తిగా ఓంకార్ దే అని సమాచారం. గ్లామర్ షో చేయాలనే ఒప్పందంతోనే శ్రీముఖిని షోకి సైన్ చేయించుకున్నారని వినికిడి. మరి ఓంకార్ ప్రణాళిక ఎంత వరకు పారిందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి. ఈ షో మొదలై కొద్దిరోజులే అవుతుంది. ఫలితాలు రావాలంటే వేచి చూడాలి.

మరోవైపు శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్ లో షోస్ చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ మధ్య సుమ, అనసూయ, రష్మీ జోరు తగ్గిన నేపథ్యంలో శ్రీముఖి బుల్లితెరను షేక్ చేస్తున్నారు. వాటికి అదనంగా ఓటీటీ షోస్ లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం అరడజను షోస్ వరకూ శ్రీముఖి చేతిలో ఉన్నాయి. ఇక ఈవెంట్స్, ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్ ద్వారా వచ్చే ఆదాయం అదనం అని చెప్పాలి. చాలా తక్కువ సమయంలో శ్రీముఖి స్టార్ యాంకర్ హోదా పట్టేశారు. తనకంటే ముందొచ్చిన సీనియర్స్ ని దాటేసి సత్తా చాటుతున్నారు.
