Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 9 Agnipariksha Promo: 'అగ్ని పరీక్ష' ప్రోమోలో కనిపిస్తున్న ఈ మాస్క్...

Bigg Boss Telugu 9 Agnipariksha Promo: ‘అగ్ని పరీక్ష’ ప్రోమోలో కనిపిస్తున్న ఈ మాస్క్ మ్యాన్ ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ చూస్తే వణికిపోతారు!

Bigg Boss Telugu 9 Agnipariksha Promo: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న ‘అగ్నిపరీక్ష'(Agnipareeksha) షో మరో నాలుగు రోజుల్లో ‘జియో హాట్ స్టార్'(Jio Hotstar) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని నిన్న విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. నవదీప్(Navdeep), అభిజీత్(Abhijeet) మరియు బిందు మాధవి(Bindu Madhavi) న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోకి శ్రీముఖి(Anchor Srimukhi) యాంకర్ గా వ్యవహరిస్తోంది. ప్రోమో ని చూస్తుంటే ఈ షో అన్ని రకాల ఎమోషన్స్ తో సాగబోతోంది అనేది అర్థం అవుతుంది. ఇందులో ఫన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫైర్ ఉంది, ఓవరాల్ గా చాలా ఆసక్తికరంగా ఉంది. కొంతమంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ మీద పిచ్చి ప్రేమ తో, టాలెంట్ లేకపోయినా నివాహకులను బ్రతిమిలాడుతూ ‘అగ్నిపరీక్ష’ ప్రక్రియ వరకు ఎంపిక అయ్యారు. అలాంటి వారిపై జడ్జీలు ఎలాంటి కనికరం చూపించలేదు, వెళ్ళిపోమని రెడ్ కార్డు చూపించారు, ఇవి నిన్నటి ప్రోమో లో మనం చూడొచ్చు.

Also Read: ఏఎస్పీ తో ఐ లవ్యూ.. ఆస్పత్రిలో ఖైదీతో హాట్ రొమాన్స్.. సంచలనం సృష్టిస్తున్న కిలేడి వీడియోలు!

ఇది కాసేపు పక్కన పెడితే ఈ ప్రోమో లో మాస్క్ తగిలించుకొని ఒక వ్యక్తి వస్తాడు గమనించారా? ,ఇతని పేరు హృదయ్ అట. ఈ షో మొత్తం అతను మాస్క్ పెట్టుకొనే కనిపిస్తాడట. కానీ జడ్జీలు ఒకసారి బలవంతం చేయడం తో మాస్క్ ని తీస్తాడట. ఇతని ప్రవర్తన చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఎవరితో సరిగా మాట్లాడే టైపు కాదట. కానీ టాస్కులు ఇచ్చినప్పుడు మాత్రం అద్భుతంగా ఆడుతాడట. కొన్ని టాస్కుల్లో ఇతని స్పీడ్ ని చూసి అసలు వీడు మనిషేనా అని జడ్జీలు సైతం ఆశ్చర్యపోయేలా చేశాడట. ఇతను బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఇతను హౌస్ లోపలకు అడుగుపెడితే కంటెస్టెంట్స్ ఇతన్ని చూసి భయపడే అవకాశాలు ఉన్నాయి. కానీ బిగ్ బాస్ లేదా నాగార్జున మాస్క్ తియ్యమని బలవంతం చేస్తే ఇతను తియ్యక తప్పేలా లేదు.

ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో ఈ మాస్క్ మ్యాన్ అంతగా యాక్టీవ్ గా ఉండడం లేదని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. మొదట్లో చాలా వింతగా, రోబో లాగా టాస్కులు ఫినిష్ చేసేవాడు కానీ, ఈమధ్య బాగా తగ్గిపోయాడట. కానీ రీసెంట్ గా మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చి కెప్టెన్ అయ్యాడట. ఇతను అయితే చివరి వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఎంతో కొంత ఉండాలి. కానీ అది ఇతనిలో లేదు. కంటెస్టెంట్స్ అందరితో కలిసి పోవాలి, ఆ లక్షణం కూడా ఇతనిలో లేదు. కాబట్టి ఇతను అగ్ని పరీక్ష షో లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏమి జరగబోతుందో చూడాలి మరి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular