T20 World Cup Semis Race టి20 మెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ 1 జాబితాలో రెండో సెమిస్ బెర్త్ ఖాయమైంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి ఇంగ్లాండ్ దర్జాగా సెమీస్ కు వెళ్ళింది. ఇప్పటికే ఈ గ్రూపులో న్యూజిలాండ్ సెమీస్ వెళ్ళింది. మ్యాక్స్ వెల్ విన్నవించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. టి20 ప్రపంచ కప్ లో ఆతిథ్య జట్టుకు కలిసి రాదని మరోసారి నిరూపితమైంది. గత ఏడాది ఛాంపియన్ ఆస్ట్రేలియా సూపర్ 12 లోనే ఇంటి ముఖం పట్టింది. కీలకమైన పోరులో శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయం సాధించడంతో మెరుగైన రన్ రేట్ ఆధారంగా సెమిస్ కు వెళ్ళింది. ప్రస్తుతం గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ +2.113, ఇంగ్లాండ్ +0.473, ఆస్ట్రేలియా -0.173 రన్ రేటు తో కొనసాగాయి. ఈ జట్లు ఏడేసి పాయింట్ల తో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్ రేటు ఆధారంగా ఇంగ్లాండ్ గ్రూప్ 1 జాబితాలో రెండో స్థానంలో నిలిచి సెమీస్ కు వెళ్ళింది. ఆస్ట్రేలియా ఇంటి ముఖం పట్టింది.

ఇరు జట్లలో ఆందోళన
సిడ్నీ వేదికగా శనివారం ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల భవితవ్యం ఆధారపడి ఉంది. మ్యాచ్ జరిగే కొద్ది ఆసీస్, ఇంగ్లాండ్ శిబిరాల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. అయితే చివరికి ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో లంకపై గెలిచి సెమిస్ బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు, అభిమానులు ఉసూరుమన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 భావలలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం లక్ష చేతనలో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి విజయం సాధించింది.
దూకుడుగా ప్రారంభించింది
లక్ష్యం చిన్నది కావడంతో ఇంగ్లాండ్ చేదన ప్రారంభించింది. ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో ఓపెనర్లు జోస్ బట్లర్ (28), అలెక్స్ హెల్స్ (47) తొలి వికెట్ కు 7.1 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. ఈ దశలో లంక బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. పరుగులు చేయడం కూడా గగనమైపోయింది. మ్యాచ్ ను ముగించేందుకు 19.4 ఓవర్ కు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం హసరంగ.. ఓపెనర్లను పెవిలియన్ కు చేర్చడంతో లంకతోపాటు ఆస్ట్రేలియా అభిమానుల్లో కాస్త జోష్ వచ్చింది. అలాగే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఫలితంగా మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చింది.. అయితే బెన్ స్టోక్స్ చివరి వరకు (42) ఆఖరి వరకు క్రీజ్ లో ఉండి జుట్టును గెలిపించాడు. ఒకవేళ శ్రీలంక ఇంకో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. లంక బౌలర్లలో లాహిరు కుమార 2, హసరంగ 2, ధనుంజయ డిసిల్వా 2 వికెట్లు తీశారు.
ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు
ఒక దశలో లంక బ్యాటింగ్ చూస్తే ఇంగ్లాండ్ బోధలకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది.. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 65 పరుగులు చేశాడు. మొదటినుంచి అవుట్ అయ్యేంతవరకు దూకుడుగా ఆడి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కుషాల్ మెండీస్ 18, ధనుంజయ 9, అసలంక 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచారు. అయితే నిస్సాంక రాణించడంతో శ్రీలంక స్కోర్ మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులకు . అయితే అప్పటికీ నిస్సాంక, హార్ట్ హిట్టర్ రాజపక్స (22) క్రీజ్ లో ఉన్నాడు. దీంతో స్కోరు 170 పరుగులైనా దాటుతుందని అందరూ భావించారు. చివర్లో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను విసరడంతో డెత్ ఓవర్లలో (16 నుంచి 20) శ్రీలంక 25 పరుగులు మాత్రమే సాధించింది. వికెట్లను కూడా కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, స్టోక్స్, వోక్స్, కరన్, అదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు.