Bigg Boss 10 Telugu: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యే సెలబ్రిటీలను ‘బిగ్ బాస్’ టీం సంప్రదించడం, వాళ్ళని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా తీసుకోవడం వంటివి గత సీజన్స్ లో చాలానే చూసాము. ఉదాహరణకు ‘బిగ్ బాస్ 9’ నే తీసుకోండి. ఈ షోలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ వంటి వారు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్ళు షో లో బలమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని బయటకు వెళ్లారు. ఇలా వివాదాల్లో ఉన్న సెలబ్రిటీలను తీసుకొని రావడం వల్ల , మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుండడంతో, ఈ సీజన్ లో కూడా అలాంటి సెలబ్రిటీలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారట బిగ్ బాస్ టీం. అందులో భాగంగానే, రీసెంట్ గానే స్కామ్స్ ఆరోపణలు ఎదురుకున్న నందు ని కూడా సంప్రదించారట మేకర్స్.
ఈమెని వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా తీసుకొని రావాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఆ కారణం చేతనే ఈమె ఇండియా కి వచ్చిందట. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు , వెంటనే నందు ని అరెస్ట్ చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈమె అసలు పేరు రామ నందన. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ని ఉపయోగించుకొని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేసిందని, ఈ స్కాం లో ఆమె భర్త మధుకర్ కూడా భాగం అయ్యాడని , వివిధ ప్రాంతాల నుండి వీరిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఇలా కోట్ల రూపాయిలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమం లో లండన్ నుండి శంషాబాద్ విమానాశ్రయం లో నందు ల్యాండ్ అయ్యింది అనే సమాచారం రావడం తో , ఇమిగ్రేషన్ వాళ్ళు ఈమెని అడ్డుకొని, పోలీసులకు సమాచారం అందించారు.
వాళ్ళు వెంటనే విమానాశ్రయం కి చేరుకొని నందు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఈమెని ‘బిగ్ బాస్ 10’ లోకి తీసుకోబోతున్నారు అనే విషయం తెలుసుకున్న నెటిజెన్స్ , బిగ్ బాస్ టీం పై మండిపడుతున్నారు. ఉప్పల్ బాలు లాంటోళ్ళు ఆడిషన్స్ కి వస్తే , మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపి , సమాజానికి ఏమి మేము ఏమి మెసేజ్ ఇవ్వాలి అని నవదీప్ అంటాడు కదా , మరి ఇలాంటి స్కాం చేసే వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి పంపి సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram