Homeఆంధ్రప్రదేశ్‌RK Kothapaluku: ఆర్కే కొత్తపలుకు: కవిత పొలిటికల్ ఎజెండా అదే. కేసీఆర్, కేటీఆర్ కాచుకోవాలట..

RK Kothapaluku: ఆర్కే కొత్తపలుకు: కవిత పొలిటికల్ ఎజెండా అదే. కేసీఆర్, కేటీఆర్ కాచుకోవాలట..

RK Kothapaluku: కెసిఆర్ మన మనిషి కాదు.. మారిన మనిషి.. మరమనిషి.. ఇలాంటి వ్యాఖ్యలు కవిత చేసిన తర్వాత.. తన పార్టీ పేరును టిఆర్ఎస్ గా ప్రకటించిన తర్వాత.. మిగతా వారేమో గాని.. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఎలా స్పందిస్తారు.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు.. వంటి అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఏర్పడింది.. ఎందుకంటే మిగతా పాత్రికేయుల మాదిరిగా రాధాకృష్ణ ఉండరు. ఎందుకంటే ఆయనకు పొలిటికల్ వాసనలు చాలా ఎక్కువగా. పొలిటికల్ పరిచయాలు కూడా ఆయనకు అదే స్థాయిలో ఉంటాయి. అందువల్ల తన పత్రికలో రాసే కొత్త పలుకులో ఎక్కువగా పొలిటికల్ అంశాలకు ఆయన ప్రయారిటీ ఇస్తుంటారు.

తాజా కొత్త పలుకులో తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల మీద ఆయన సొంత విశ్లేషణ చేశారు.. కవిత కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో.. ఆ ప్రభావం కెసిఆర్, కేటీఆర్ మీద గట్టిగానే ఉంటుందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావసభలో కవిత కెసిఆర్ ను విమర్శించడం.. మర మనిషిగా సంబోధించడం ఆ కోవలోకి వస్తాయని రాధాకృష్ణ స్పష్టం చేశారు.. ఇకపై కేటీఆర్, కెసిఆర్ కవిత నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాధాకృష్ణ పేర్కొన్నారు.. కవిత రాజకీయ పార్టీ కాంగ్రెస్ కంటే కూడా భారత రాష్ట్ర సమితికి ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశం ఉందని రాధాకృష్ణ అన్నారు.

కవిత చేసిన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ మీద మరింత రెచ్చిపోయారు రాధాకృష్ణ. ఈరోజుకు కూడా తాను చేసిన తప్పు ఏమిటో కేసీఆర్ గుర్తించలేకపోతున్నారని.. తనకు ఓటు వేయలేకపోవడం తెలంగాణ ప్రజల తప్పే అన్నట్టుగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని రాధాకృష్ణ అన్నారు. రాధాకృష్ణ ఇక్కడ మర్చిపోయిన ఒక విషయం ఉంది. ఏ రాజకీయ నాయకుడు గాని.. ఇంకా పేరుపొందిన వ్యక్తులు మరెవరైనా గాని.. తమతప్పులు గుర్తించరు. మరొకరు సలహా ఇస్తే పట్టించుకోరు. ఎందుకంటే అప్పటికే అహం వారిని కమ్ముకొని ఉంటుంది. ఇది కేసీఆర్ కు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇదే వ్యాసంలో రేవంత్ రెడ్డి ఎవరినీ కలవడం లేదని రాధాకృష్ణ పేర్కొన్నారు. అంత బిజీగా ముఖ్యమంత్రి లేడని.. ఒకవేళ బిజీగా ఉన్నప్పటికీ కలవాలని రాధాకృష్ణ అన్నారు. దీనికి కేసీఆర్ మాత్రం ఎందుకు మినహాయింపు అవుతారు. పైగా ఉద్యమ సమయంలోనే కేసీఆర్ చాలామందికి దూరంగా ఉన్నారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆయన అందరిని కలుస్తారని రాధాకృష్ణ ఎలా అనుకుంటారు..

ఇదే వ్యాసంలో రేవంత్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు రాధాకృష్ణ. రేవంత్ రెడ్డి ఇలానే వ్యవహరించుకుంటూ పోతే తన పేరు మార్చుకోవాల్సి ఉంటుందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. పేరు మార్చుకున్నంత మాత్రాన పెద్దగా ఇబ్బంది ఉండదని.. ముద్రగడ పద్మనాభం ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా చెప్పారు.. కెసిఆర్ ను మాత్రమే కాదు.. రేవంత్ రెడ్డికి కూడా రాధాకృష్ణ గట్టిగానే తలంటారు.. మొత్తంగా ఈ వ్యాసంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని రాధాకృష్ణ వదిలిపెట్టలేదు. కొన్ని సందర్భాలలో రాధాకృష్ణ జర్నలిజంలో నచ్చే బ్యూటీ ఇదే. అన్నట్టు కేసీఆర్ మీద పాజిటివ్ గా ఈ ఆదివారం కొత్త పలుకులు రాధాకృష్ణ రాసుకుంటూ పోయారు.. ఇద్దరి మధ్య ఏదైనా సయోధ్య కుదిరిందా.. ఏమో బావాబామ్మర్దుల మధ్య లోగుట్టు పేరుమాల్లకేరుక.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular