Homeక్రీడలుక్రికెట్‌Delhi Vs Punjab: 264 కొట్టినా ఢిల్లీ ఓడిపోయింది.. అయ్యర్ కాదు, దీనంతటికీ ఆ డీసీ...

Delhi Vs Punjab: 264 కొట్టినా ఢిల్లీ ఓడిపోయింది.. అయ్యర్ కాదు, దీనంతటికీ ఆ డీసీ ఆటగాడే కారణం..

Delhi Vs Punjab: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 264 స్కోర్ అంటే మాములు విషయం కాదు. ఓవర్ కు దాదాపు 14 దాకా పరుగులు చేయాలి. వేగంగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కొంటు బ్యాటర్లు ఈ స్థాయిలో పరుగులు చేయాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. ఒకవేళ ప్లాట్ మైదానాలు అయితే ఆటగాళ్లు వీర పోరాటం చేయాలి. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ప్లేయర్లు వీర పోరాటం చేశారు. ఓపెనర్లు విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశారు. బంతి […]

Delhi Vs Punjab: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 264 స్కోర్ అంటే మాములు విషయం కాదు. ఓవర్ కు దాదాపు 14 దాకా పరుగులు చేయాలి. వేగంగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కొంటు బ్యాటర్లు ఈ స్థాయిలో పరుగులు చేయాలంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. ఒకవేళ ప్లాట్ మైదానాలు అయితే ఆటగాళ్లు వీర పోరాటం చేయాలి.

ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ప్లేయర్లు వీర పోరాటం చేశారు. ఓపెనర్లు విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశారు. బంతి పడగానే బౌండరీ వైపు మళ్ళించారు. ఫోర్ లేదా సిక్సర్ మాత్రమే తమకు ఇంట్రెస్ట్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. వారే పరుగుల సునామీ సృష్టిస్తే.. కెప్టెన్ అయ్యర్ అంతకుమించి అన్నట్టుగా ఆడాడు. మెరుపు వేగంతో పరుగులు తీశాడు.

ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే తన జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. రాకెట్ వేగంతో హాఫ్ సెంచరీ చేసిన అయ్యర్.. పంజాబ్ జట్టు పంజా దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి ఢిల్లీ జట్టుకు చూపించాడు. వాస్తవానికి పంజాబ్ ఓపెనర్లు కొట్టడం.. అయ్యర్ దాన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఢిల్లీ జట్టు ఆటగాడు కరుణ్ నాయర్. ముఖ్యంగా అయ్యర్ కు అతడు రెండు జీవధానాలు లభించేలాగా నాయర్ చేశాడు. అయ్యర్ రెండుసార్లు ఇచ్చిన క్యాచ్ లు ను నాయర్ నేల పాలు చేశాడు. దీంతో వచ్చిన అవకాశాలను అయ్యర్ సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి పంజాబ్ జట్టును గెలిపించాడు.

రెండు సందర్భాలలో అయ్యర్ క్యాచ్ లను నేలపాలు చేసిన నాయర్ పై అక్షర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడు ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా ఢిల్లీ బౌలర్లు కఠినంగా బంతులు వేయలేకపోయారు. కులదీప్ యాదవ్ నుంచి మొదలుపెడితే.. అక్షర్ వరకు ప్రతి బౌలర్ పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. అందువల్లే పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా అయ్యర్ తప్పులు చేయడు. కానీ ఈ మ్యాచ్లో రెండుసార్లు చేశాడు. రెండు సందర్భాల్లో కూడా బతికిపోయాడు. అందువల్లే అంతటి భారీ స్కోర్ ఉన్నప్పటికీ కూడా తన జట్టును గెలిపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper