Homeటాప్ స్టోరీస్CM Revanth Reddy: నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా..రేవంత్ కు ఇది మైనస్ కానుందా..

CM Revanth Reddy: నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా..రేవంత్ కు ఇది మైనస్ కానుందా..

CM Revanth Reddy: కరెక్టే కేసీఆర్ మీద,అతడి మీద రేవంత్ కు కోపం ఉండటం సహజమే. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ అత్యంత తెలివిగా ఎర్రబెల్లి దయాకర్ రావును ముందు పెట్టి ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అత్యంత తెలివిగా ఇరికించాడు. ఆ తర్వాత జైలుకు పంపించాడు. ఉగ్రవాదులను వేసే బ్యారక్ లో వేశాడు. కుమార్తె పెళ్లికి చుట్టపుచూపులాగా వచ్చేలా చేశాడు. చివరికి కొడంగల్ లో ఓడించాడు. పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఇన్ని […]

CM Revanth Reddy: కరెక్టే కేసీఆర్ మీద,అతడి మీద రేవంత్ కు కోపం ఉండటం సహజమే. నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ అత్యంత తెలివిగా ఎర్రబెల్లి దయాకర్ రావును ముందు పెట్టి ఓటుకు నోటు కేసులో రేవంత్ ను అత్యంత తెలివిగా ఇరికించాడు. ఆ తర్వాత జైలుకు పంపించాడు. ఉగ్రవాదులను వేసే బ్యారక్ లో వేశాడు. కుమార్తె పెళ్లికి చుట్టపుచూపులాగా వచ్చేలా చేశాడు. చివరికి కొడంగల్ లో ఓడించాడు. పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఇన్ని చేసిన తర్వాత ఎవరికైనా కాలుతుంది. పైగా 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ దళిత నాయకుడిని ముందు పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానం దక్కకుండా చేశాడు..

ఇవన్నీ మర్చిపోవడానికి రేవంత్ మాములోడుకాదు. పైగా రేవంత్ లో షికండి రాజకీయాలు ఉండవు. ఎదున్నా ఫేస్ టు ఫేస్. కానీ, అన్ని సార్లు ఇవి వర్కవుట్ కావు. ప్రతిపక్షపార్టీలో ఉన్నప్పుడు ఆగ్రహంగా మాట్లాడితే జనం ఈలలు వేస్తారు. గోలలు చేస్తారు. కానీ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా లేకపోతే జనం హర్షించరు. ఎందుకంటే రాష్ట్ర కథానాయకుడిగా రేవంత్ మాట్లాడే ప్రతి మాటను ప్రజలు అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తారు. పేగులు మెడలో వేసుకుంటా. నెత్తుటిని పంట పొలాల మీద చల్లుతా.. బహిరంగంగా ఉరి తీయాలి.. తొక్కి నార తీయాలి.. మెడలు వంచుతా.. జైళ్లో వేస్తా..ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు మాట్లకూడదు.

నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఢిల్లీలో చక్రాలుతిప్పుతా అని భీషణ మాటలు మాట్లడినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. తనసొంత మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు రాయించుకుంటే జనం ట్రోల్ చేశారు. అయినా క్షేత్రస్థాయి పరిస్థితి అంచనావేయకుండా కేసీఆర్ తనను తాను గొప్పగా ఊహించుకున్నారు. కేంద్రంపై చేసే యుద్దంలో ఏకంగా ప్రధానమంత్రితో పెట్టుకున్నారు. ప్రధానమంత్రిని కించపరిచేవిధంగా మాట్లాడారు. చంద్రబాబును ఏమీ తెలయని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రులను రం… అని దూషించారు.ఇవన్నీతెలంగాణ ప్రజలు చూశారు. సైలెంట్ గా 2023 ఎన్నికల్లో ఓడించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఫలితమిచ్చారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణలో కేసీఆర్ కు గొప్ప పేరుంది. కనీసం ఆ ఉద్యమ నాయకుడని కూడా చూడకుండా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్, ఆయన పార్టీలో ఉన్న అహంకారాన్ని తట్టుకోలేక విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కేసీఆర్ కు అనేక అవకాశాలు ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో అంత ఓపికతో ఉండరు. రేవంత్ మాట్లాడే భాష ఇప్పటికే జుగుస్పాకరంగా ఉంది. హిట్లర్, పేగులు మెడలో వేసుకుంటా.. నెత్తుటితో పంట పొలాలు పారిస్తా.. కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు.. ఇలాంటి మాటలు రేవంత్ మాట్లాడటం సహేతుకం కాదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు ఇచ్చిన ఫలితాన్ని చూసి కూడా రేవంత్ మారకపోతే ఆ తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper