Homeటాప్ స్టోరీస్Konda Family Controversy: వివాదాల నుడిగుండంలో 'కొండా''

Konda Family Controversy: వివాదాల నుడిగుండంలో ‘కొండా”

– తరచూ వార్తల్లో నిలుస్తున్న మంత్రి కుటుంబం – గతంలోనూ తమ వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ మురళి దంవతులు Konda Family Controversy: మంత్రి కొండా సురేఖ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల వారి కుమార్తె సీఎం రేవంత్రెడ్డి, వరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో మంత్రి సురేఖ సినీ నటి సమంత, అక్కినేని కుటుంబంపై తీవ్ర ఆరోవణలు చేశారు. […]

– తరచూ వార్తల్లో నిలుస్తున్న మంత్రి కుటుంబం

– గతంలోనూ తమ వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డ మురళి దంవతులు

Konda Family Controversy: మంత్రి కొండా సురేఖ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల వారి కుమార్తె సీఎం రేవంత్రెడ్డి, వరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో మంత్రి సురేఖ సినీ నటి సమంత, అక్కినేని కుటుంబంపై తీవ్ర ఆరోవణలు చేశారు. ఈ విషయంపై టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని కోర్టులో వరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఆ విషయంలో నురేఖ క్షమావణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇటీవల గీసుగొండ మండలంలో జరిగిన సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె కూతురు నుస్మిత మాట్లాడుతూ సీఎం రేవంత్ తమ అండతో వీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా ఎదిగాడని తన నాన్న మురళికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి డైపర్లు వేసుకొని తిరుగుతున్నాడని అలాంటి వృద్ధుడికి మళ్లీ టికెట్ ఇస్తామని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

ఆమె వ్యాఖ్యలతో వరంగల్ రాజకీయాల లొల్లి రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేపాయి. నుస్మిత తల్లి నురేఖ మంత్రిగా కొనసాగుతున్న ప్రభుత్వం, సీఎం, ఎమ్మెల్యే, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాన్రెడ్డిని విమర్శించడంపై సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా నుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. కాంగ్రెస్లో నుస్మితకు సభ్యత్వమే లేదని, రాజకీయ అనుభవం, అవగాహనా రాహిత్యం, అపరిపక్వతతో స్థాయికి మించి మాట్లాడిందని సొంత పార్టీ వాళ్లే బహిరంగంగా విమర్శిస్తున్నారు. మంత్రిగా కొనసాగుతూ ప్రతివక్షాల విమర్శలకు దీటుగా స్పందించాల్సిన సురేఖ కుటుంబం స్వవక్షంపై విమర్శలు చేయడం అధిష్ఠానం జీర్ణించుకోలేకపోతోంది. ‘కొండా’ వ్యతిరేకులకు తామే ఆయుధం ఇచ్చినట్లైంది.

ఆమె కూతురు మాట్లాడిని విషయంపై కొండా సురేఖను మంత్రి వదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వచ్చింది. ఇవ్పటికే వ్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తరచూ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలతో పాటు ఇప్పుడు సుస్మిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అధిష్ఠానం భావిస్తోంది. పార్టీ లైన్ దాటొద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిస్తున్నారు. గతంలో తాను సురేఖను కాపాడానని ఇప్పుడు చర్యలు తీసుకోక తప్పదని మహేష్ స్పష్టం చేశారు.

తన కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని మంత్రి సురేఖ అధిష్ఠానానికి లేఖ రాశారు. ఇటీవల వివిధ అభివృద్ధి వనుల ప్రారంభం కోసం వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వరకాల నభకు మంత్రి సురేఖ, కొండా మురళి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి డుమ్మా కొట్టారు. ఇప్పటికే వారికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బన్వరాజు సారయ్యలతో ఎడముఖం, పెడముఖంగా ఉంటున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. తల్లిదండ్రుల ప్రోద్భలంతోనే నున్మెత ఇలా మాట్లాడిందని పార్టీలోని కొందరు చర్చించుకుంటున్నారు. తమ సొంత జిల్లా ఇన్చార్జి బాధ్యతలు తమకు కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించడంపై కినుకు వహించారా ? లేక పార్టీలో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని భావిస్తున్నారా ? వరకాల టికెట్ సుస్మితకు, ఎమ్మెల్సీగా మురళిని ప్రకటించాలని అనుకుంటున్నారా? పార్టీలో వట్టు నిలువుకొని, క్యాడర్ను కాపాడుకోవాలనుకుంటున్నారా? • ? అని పార్టీలోని చర్చించుకుంటున్నారు.

తొలిసారి మంత్రి అడ్లూరి లక్షణ్ ఈ విషయం పై స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ నురేఖ రాజీనామా చేయాలని దిమాండ్ చేశారు. సాధారణంగా ఎన్నికలు సమీపించినప్పుడు ఎమ్మెల్యే టికెట్ల ప్రస్తావన, వివాదాలు, అలకలు, బుజ్జగింపులు ఉంటాయి. కానీ ఇంకా రెండు నంవత్సరాలు గడువున్నా ఇప్పుడే వరకాల టికెట్పై లొల్లి వీధికెక్కడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. నుస్మిత వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. ఆమె మాటల మంటలకు వుల్స్టాప్ పెట్టాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దించింది. నుస్మిత వ్యాఖ్యల వెనుక వారి తల్లిదండ్రులు ఉన్నారా ? నభికులను సంతోషవరచడానికి సుస్మిత అలా మాట్లాడిందా ? కావాలనే తనకు తానుగా ఆమె తల్లిదండ్రులకు నంబంధం లేకుండా మాట్లాడిందా ? తేలాల్సి ఉంది. సీఎం రేవంత్ లండన్ పర్యటన ముగించుకొని సోమవారం హైదరాబాద్కు రానున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది.

 B. Suresh kumar MA, B. Ed journalist

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper