Homeఆంధ్రప్రదేశ్‌Police Constable Accident: కానిస్టేబుల్ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన ఎస్పి.. వీడియో వైరల్!

Police Constable Accident: కానిస్టేబుల్ మృతదేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన ఎస్పి.. వీడియో వైరల్!

Police Constable Accident: చాలామంది ఉన్నతాధికారులు రువాబు చేస్తుంటారు. కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తుంటారు. బాసీజం చూపిస్తుంటారు. దాదాపు అన్ని శాఖల్లో ఉంటుంది ఈ రుబాబు. చివరకు ప్రైవేటు కార్యాలయాల్లో కూడా కనిపిస్తుంది. పోలీస్ శాఖలో మరీ ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ఓ సాధారణ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే.. బాధతో భావోద్వేగానికి గురయ్యారు ఓ జిల్లా పోలీస్ అధికారి. బోరున ఏడ్చేశారు విజయనగరం ఎస్పీ దామోదర్. ఉన్నతాధికారులు అంతే కఠినంగా ఉంటారు అనే ప్రచారం ఉన్న […]

Police Constable Accident: చాలామంది ఉన్నతాధికారులు రువాబు చేస్తుంటారు. కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తుంటారు. బాసీజం చూపిస్తుంటారు. దాదాపు అన్ని శాఖల్లో ఉంటుంది ఈ రుబాబు. చివరకు ప్రైవేటు కార్యాలయాల్లో కూడా కనిపిస్తుంది. పోలీస్ శాఖలో మరీ ఎక్కువగా ఉంటుంది. అటువంటిది ఓ సాధారణ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే.. బాధతో భావోద్వేగానికి గురయ్యారు ఓ జిల్లా పోలీస్ అధికారి. బోరున ఏడ్చేశారు విజయనగరం ఎస్పీ దామోదర్. ఉన్నతాధికారులు అంతే కఠినంగా ఉంటారు అనే ప్రచారం ఉన్న ఈ పరిస్థితుల్లో.. ఓ సామాన్య కానిస్టేబుల్ మృతిని తట్టుకోలేక ఎంతో బాధపడ్డారు ఎస్పీ దామోదర్. చివరకు మంత్రి సముదాయించడంతో సాధారణ స్థితికి వచ్చారు.

* బ్రేకులు ఫెయిల్ కావడంతో..
విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీస్ వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడంతో చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. ఎస్సై తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. విజయనగరం గ్రామీణ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్ ఓ కేసు విచారణ నిమిత్తం వెళ్తుండగా వారి వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్ వీర వెంకటరమణ మృతి చెందాడు. ఎస్సై అశోక్ నాగేంద్రప్రసాద్, డ్రైవర్ రాజబాబుకు గాయాలయ్యాయి.

* ఆసుపత్రి వద్ద మృతదేహం చూసి…
మృతుడితోపాటు క్షతగాత్రులను విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఇంకోవైపు హోం మంత్రి అనిత ఈ ఘటనపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ దామోదర్ తో మాట్లాడారు. మహారాజా ఆసుపత్రి వద్ద మృతదేహాన్ని చూసిన ఎస్పీ దామోదర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాను ఒక జిల్లా పోలీస్ బాస్ అని కూడా మరిచిపోయి కన్నీటి పర్యాంతమయ్యారు. బోరున ఏడ్చేశారు. అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్పీని సముదాయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Suri8 News (@suri8_tv)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper