Kavya Maran marriage : క్రికెట్ లవర్స్‌కు మాత్రమే కాదు… సౌత్ ఇండియన్ సినిమా అభిమానులకు కూడా ఇదొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ న్యూస్! ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈవో కావ్య మారన్ పెళ్లి పీటలెక్బోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! అంతేకాదు, ఆ అదృష్టవంతుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు! ఆ వివరాలేంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం!
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, అందరి అభిమాన SRH సీఈవో కావ్య మారన్.. టాలీవుడ్, కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్‌తో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారట! గత కొంతకాలంగా వీరిద్దరి గురించిన రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ వార్త నిజమేనని క్లారిటీ వచ్చేస్తోంది.
ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సీఎం దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి.. తమ కుమార్తె కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ల వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు! తెలంగాణ సీఎంఓ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ డ్రీమ్ వెడ్డింగ్‌కు సంబంధించిన డేట్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 11వ తేదీన గ్రీస్‌లో వీరి వివాహం అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అత్యంత వైభవంగా జరగనుందట! ఆ తర్వాత నవంబరు 21న చెన్నై వేదికగా అత్యంత గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు తమిళనాడు ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు భారీగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.. ఈ ఇన్విటేషన్స్ చూస్తుంటే నవంబర్‌లో టాలీవుడ్, కోలీవుడ్ఐ పీఎల్ సర్కిల్స్‌లో ఒక భారీ సెలబ్రేషన్ జరగడం మాత్రం పక్కా అనిపిస్తోంది. మరి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, ఐపీఎల్ క్వీన్ కావ్య మారన్ జోడీపై మీ అభిప్రాయం ఏంటి? వీరిద్దరూ నిజంగా పర్ఫెక్ట్ కపుల్ అని మీరు భావిస్తే కింద కామెంట్ చేయండి.