Jonitha Gandhi: ఈ నెల 11 న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ , కావ్య మారన్ పెళ్లి ఘనంగా జరగబోతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుండి ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట, ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుండడంతో సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇప్పుడు వీళ్ళ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. కళానిధి మారన్ కూతురిగా కావ్య మారన్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ఒక ఎమోషన్ గా ఫీల్ అయ్యే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం కి ఈమె ఓనర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. ఇకపోతే కళానిధి మారన్ సన్ నెట్వర్క్స్ సంస్థ కి అధినేత అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ కి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరించాడు.
అంతే కాకుండా సన్ నెట్ వర్క్స్ సంస్థ లో తెరకెక్కిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కూడా అనిరుద్ సంగీతం అందించాడు. జైలర్ సినిమా సక్సెస్ అవ్వడం తో కళానిధి మారన్ అనిరుద్ కి కారు బహుమతిగా ఇచ్చాడు. ఇక ‘జైలర్ 2’ సక్సెస్ కి ఏకంగా తన కూతురినే బహుమతిగా ఇస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో పెట్ట ఎత్తున ప్రచారం సాగింది. ఇలా సోషల్ మీడియా లో ఈ పెళ్లి పై ఎన్నో ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోపక్క కళానిధి మారన్ దంపతులు ప్రముఖ రాజకీయ నాయకులను , సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయం లో ప్రముఖ సింగర్ జోనిత గాంధీ పెట్టిన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ‘నువ్వు వదిలి వెళ్లిపోయిన చోటే’ అనే పాట లిరిక్స్ ని తన స్టోరీ లో పెడుతూ , తన డిప్రెషన్ మూడ్ ని ఆడియన్స్ కి చెప్పకనే చెప్పింది. అనిరుద్ కి జోనిత తో మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి , ఆమె సరిగ్గా ఆయన పెళ్లి సమయం లో ఇలాంటి పోస్టులు పెట్టడం తో ఫ్యాన్స్ లో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అనిరుద్ జోనిత ని మోసం చేసాడు అంటూ సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేయడం కూడా మొదలు పెట్టారు. అనిరుద్ పై గతం లో కూడా ఇలాంటి రూమర్స్ చాలానే ఉండేవి. ముఖ్యంగా సుచీ లీక్స్ లో ఎక్కువ శాతం ప్రైవేట్ ఫోటోలు అనిరుద్ కి సంబంధించినవే వచ్చాయి. ఆరోజుల్లో ఇది పెద్ద సంచలనం రేపింది.