HomeతెలంగాణCM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి షాక్‌ ఇచ్చిన ట్విట్టర్‌.. అసలేమైంది?

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డికి షాక్‌ ఇచ్చిన ట్విట్టర్‌.. అసలేమైంది?

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దిగ్గజ సోషల్‌ మీడియా సంస్థ ఎక్స్‌(ట్విట్టర్‌) షాక్‌ ఇచ్చింది. ఆయన ఖాతాలోని బ్లూ టిక్‌ మాయం కావడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌ ఎలాన్‌మస్క్‌ చేతికి వచ్చాక అనేక మార్పులు జరిగాయి. చివరకు పేరు కూడా ఎక్స్‌గా మార్చేశారు. పిట్టను తొలగించారు. X సింబల్‌ను అందులో చేర్చారు. ఇక బ్లూ టిక్‌ ఒకప్పుడు వెరిఫైడ్‌ అకౌంట్స్‌కు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. దీంతో ఎవరిది ఫేక్‌ అకౌంట్, ఎవరిది రియల్‌ అకౌంటో తెలియని పరిస్థితి నెలకొంది.

అసలు ఏం జరిగిందంటే..
సీఎం రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతా బ్లూ టిక్‌ మార్కు కోల్పోయారు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌ ఎక్స్‌ ఖాతాను ఎవరైనా హ్యాక్‌ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఫాలోవర్లు అయితే హ్యాకింగ్‌ వలన ఇలా జరగదని, టెక్నికల్‌ సమస్య అయి ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రొఫైల్‌ పిక్చర్‌ మారడంతో..
సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌ పిక్చర్‌ మార్చడంతో ఈ సాంకేతిక సమస్య ఏర్పడిందని బ్లూ టిక్‌ మాయమైందని సీఎం సోషల్‌ మీడియా అకౌంట్లు చూస్తున్న టీం తెలిపింది. రెండు రోజుల్లో బ్లూ టిక్‌ మార్కు తిరిగి వస్తుందని పేర్కొంది. ప్రజలు గందరగోళానికి గురికాకుండా ఎక్స్‌ ప్లాట్‌ఫారమ్‌పై ట్యాగ్‌ చేయడం, మెసేజ్‌ చేయడం కొనసాగించవచ్చని వెల్లడించింది.

ప్రొఫైల్‌ పిక్‌గా రాహుల్‌గాంధీ..
ఇక రేవంత్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌ పిక్‌గా ఇంతకాలం అతని ఫొటో ఉండేది. ఇప్పుడు దానిని తొలగించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో కలిసి టార్చ్‌ పట్టుకుని నడుస్తున్న ఫొటోను పెట్టుకున్నారు. ఈ కారణంగానే బ్లూ టిక్‌ సమస్య తలెత్తిందని అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper