Vijay Deverakonda Meets CM Revanth Reddy: ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో భేటీ అవ్వడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ ని మొదటి నుండి BRS పార్టీ సానుభూతిపరుడిగానే చూస్తూ వచ్చారు. KTR తో ఆయనకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటిది ఈమధ్య కాలం లో ఎక్కువగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి తో క్లోజ్ గా ఉండడం అనేది, నిజంగా చర్చించాల్సిన విషయమే. ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి ని కలవడం వెనుక కారణం ఏంటి?, రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలలో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. ఈ సందర్భంగా సీఎం ని అభినందించడానికి విజయ్ దేవరకొండ వచ్చాడా?, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
అయితే ఈ నెల 26 న ఉదయ్ పూర్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహం జరగబోతుంది. ఈ వివాహ వేడుకకు హాజరు కావాలని మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డి ని కలిసి ఆయనకు శుభ లేఖని ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ వివాహానికి హాజరు కాలేకపోతే, హైదరాబాద్ లో జరగబోయే రిసెప్షన్ కార్యక్రమానికి అయినా హాజరు కావాలంటూ విజయ్ దేవరకొండ సీఎం ని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం సీఎం రేవంత్ రెడ్డి ని మాత్రమే కాదు, రాజకీయ ప్రముఖులందరితో పాటు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులందరినీ కూడా విజయ్ దేవరకొండ స్వయంగా కలిసి ఆహ్వానించబోతున్నట్టు టాక్. వీరిలో ఎంత మంది ఉదయ్ పూర్ వరకు వస్తారో చూడాలి. విజయ్ దేవరకొండ కి సినీ ఇండస్ట్రీ లో అత్యంత ఆప్తుడు అల్లు అర్జున్. ఆయన కచ్చితంగా ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. కానీ రిసెప్షన్ కి మాత్రం అందరూ హాజరు కాబోతున్నారు.
‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయం లో రష్మిక తో విజయ్ కి ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత అది స్నేహంగా మారి, ప్రేమ గా మారడం, ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత ఇష్టం ఏర్పడడం తో గత కొన్నేళ్ల నుండి హైదరాబాద్ లో ఒకే నివాసం లో వీళ్లిద్దరు ఉండడం వంటివి జరిగాయి. ఇదంతా అబద్దమని రష్మిక ఎప్పుడూ చెప్పలేదు. విజయ్ దేవరకొండ అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వీళ్లిద్దరి పెళ్లి ఎట్టకేలకు ఈ నెల 26న జరుగుతుందని గత ఏడాదే ఒక వార్త వచ్చింది. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఆ పెళ్ళికి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. వీళ్లిద్దరి పెళ్లి కి సంబంధించిన ఫోటోలు,వీడియోలు కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.