Family Trip Cars: నేటి కాలంలో ఫ్యామిలీతో కలిసి షికారు వెళ్లాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు ఎక్కువగా 7 సీటర్ కారు వైపు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ కారు బడ్జెట్ లో అయితే మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం తక్కువ బడ్జెట్‌లో మంచి కంఫర్ట్, సేఫ్టీ, బ్రాండ్ వాల్యూ ఉన్న కార్లు మార్కెట్లో ఉన్నాయి. అలాగే మంచి మైలేజ్ ఇస్తూ, బెస్ట్ ఫీచర్లతో వస్తున్న పాపులర్ కార్లు ఏవో చూద్దాం..
నిస్సాన్ గ్రావిట్ :
నిస్సాన్ నుంచి 2026లో లాంచ్ అయిన సరికొత్త 7 సీటర్ కారు గ్రావిట్. ఇది రెనాల్ట్ ట్రైబర్‌కు పోటీగా ఉంటుంది. ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ , సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. దీని ధర సుమారు రూ. 5.73 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మూడు వరుసల సీటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బడ్జెట్‌లో 7 మంది సులభంగా ప్రయాణించేందుకు ఇది అద్భుతమైన ఎంపిక.
రెనాల్ట్ ట్రైబర్:
భారతదేశంలో 7 సీటర్ కొనాలని అనుకునేవావారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇది బడ్జెట్ లోనే వస్తుంది. దీని ధర రూ. 5.81 లక్షల నుంచి మొదలవుతుంది. మూడువరుస సీట్లతో ఉన్నా.. ఇందులో బూట్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. 4 స్టార్ గ్లోబల్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగిన ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్, 4 ఎయిర్‌బ్యాగ్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిటీ డ్రైవింగ్‌కు తో పాటు ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఇది బెస్ట్ బడ్జెట్ కారు.
మహీంద్రా బొలెరో:
కఠినమైన రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించే రఫ్ అండ్ టఫ్ కారు బోలెరూ. ఇందులో పవర్‌ఫుల్‘ఎమ్ హ్యాక్’ డీజిల్ ఇంజిన్ ఉండనుంది. బలమైన మెటల్ బాడీ తో పాటు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారులో ఏబీఎస్ , డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మారుతి ఎర్టిగా:
ఇండియాలో ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటున్న మారుతి ఎర్టీగా కారు లో 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 26 కిలోమీటర్ల మైలేజ్ ని ఇస్తుంది. ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 8.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.