Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీTechnology User Growth Speed: చూస్తుండగానే లక్షలు.. కోట్లు.. ధ్వని వేగాన్ని మించిన టెక్నాలజీ స్పీడ్!

Technology User Growth Speed: చూస్తుండగానే లక్షలు.. కోట్లు.. ధ్వని వేగాన్ని మించిన టెక్నాలజీ స్పీడ్!

Technology User Growth Speed: సమాచారం.. ఈ నాలుగు అక్షరాల పదం ప్రపంచ గతిని మొత్తం పూర్తిగా మార్చేసింది. ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి.. ఇతర ప్రాంతంలో జరిగిన సంఘటనల గురించి కనుక్కోవడానికి.. శాస్త్రవేత్తలు విపరీతంగా ప్రయోగాలు చేశారు. పక్షుల ద్వారా లేఖలు పంపడం.. మనుషుల ద్వారా రాయబారాలు పంపడం.. కొంతకాలానికి ఉత్తరాలు పంపడం.. ఇలా సమాచార సేకరణలో రకరకాల ముందడుగులు పడ్డాయి. ఇవన్నీ కొంతమేర ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. మనిషి కోరుకున్న విధంగా నూటికి నూరు శాతం […]

Technology User Growth Speed: సమాచారం.. ఈ నాలుగు అక్షరాల పదం ప్రపంచ గతిని మొత్తం పూర్తిగా మార్చేసింది. ఎదుటి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి.. ఇతర ప్రాంతంలో జరిగిన సంఘటనల గురించి కనుక్కోవడానికి.. శాస్త్రవేత్తలు విపరీతంగా ప్రయోగాలు చేశారు. పక్షుల ద్వారా లేఖలు పంపడం.. మనుషుల ద్వారా రాయబారాలు పంపడం.. కొంతకాలానికి ఉత్తరాలు పంపడం.. ఇలా సమాచార సేకరణలో రకరకాల ముందడుగులు పడ్డాయి. ఇవన్నీ కొంతమేర ఫలితాన్ని ఇచ్చినప్పటికీ.. మనిషి కోరుకున్న విధంగా నూటికి నూరు శాతం ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి.

Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!

అనేక ప్రయోగాల తర్వాత..

ఎదుటి వ్యక్తి లేదా ఇతర ప్రాంతంలో జరిగిన సంఘటనల గురించి సమాచారం తెలుసుకోవడానికి మనిషి అనేక విధాలుగా చేసిన ప్రయోగాల ఫలితంగా టెలిఫోన్ ఏర్పాటయింది. టెలిఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది 100 మిలియన్ యూజర్ల మార్క్ అందుకోవడానికి దాదాపు 75 సంవత్సరాలు పట్టింది. టెలిఫోన్ తర్వాత మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్ 100 యూజర్ల సంఖ్యను చేరుకోవడానికి దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. టెలిఫోన్, మొబైల్ ఫోన్ తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది 100 మిలియన్ల యూజర్ల సంఖ్యను అందుకోవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది.

మొత్తం మారిపోయింది

టెలిఫోన్, మొబైల్ ఫోన్, వరల్డ్ వైడ్ వెబ్ తర్వాత టెక్నాలజీ సమూలంగా మారిపోయింది. ఇందులో భాగంగానే కొత్త కొత్త సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సౌలభ్యాలు కూడా మనిషి జీవితాన్ని సుఖవంతం చేశాయి. ఈ క్రమంలో యాపిల్ ఫోన్ రూపొందించిన ఐ ట్యూన్స్ తెరపైకి వచ్చాయి. ఇవి 100 మిలియన్ యూజర్ల సంఖ్యను చేరుకోవడానికి దాదాపు 6.5 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత ట్విట్టర్ 100 మిలియన్ యూజర్ల సంఖ్యను చేరుకోవడానికి ఐదు సంవత్సరాలు, ఫేస్ బుక్ 100 మిలియన్ యూజర్ల సంఖ్యను చేరుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. వాట్సప్ కు 3.5 సంవత్సరాలు.. ఇన్ స్టా గ్రామ్ కు 2.5 సంవత్సరాలు పట్టింది. ఆపిల్ యాప్ స్టోర్ కు 2 సంవత్సరాలు పట్టింది.

ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తున్న చాట్ జిపిటి కి 100 మిలియన్ యూజర్ల సంఖ్యను చేరుకోవడానికి కేవలం రెండు నెలలు మాత్రమే పట్టింది. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అందుబాటులోకి రావడంతో చాలామంది దాని చుట్టూ పరిభ్రమిస్తున్నారు. ప్రతి విషయాన్ని దాని ద్వారానే తెలుసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. చాట్ జిపిటి కేవలం రెండు నెలల్లో 100 మిలియన్ యూజర్ల సంఖ్యను పెంచుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే టెక్నాలజీ వేగం ఇక్కడితోనే ఆగిపోదు. ఎందుకంటే టెక్నాలజీ శక్తి నిత్యత్వ సూత్రం లాంటిది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper