HomeతెలంగాణSuman Son Sujay: సుమన్ కొడుకు ఎంట్రీ.. రామోజీ గ్రూపుకు మగవారసుడు వచ్చేసాడు..

Suman Son Sujay: సుమన్ కొడుకు ఎంట్రీ.. రామోజీ గ్రూపుకు మగవారసుడు వచ్చేసాడు..

Suman Son Sujay: మనం ఎంత కాదనుకున్న సరే మన సమాజం ముమ్మాటికి పితృ సమాజమే. ఇప్పటికీ మగవాళ్లను మాత్రమే వారసులుగా చూస్తూ ఉంటారు. కేవలం పేద.. మధ్యతరగతి కుటుంబాలలోనే కాదు.. పెద్దపెద్ద శ్రీమంతుల కుటుంబాలలో కూడా జరుగుతున్న తంతు ఇదే. ఆ మధ్య చిరంజీవి తన వారసుడిగా రామ్ చరణ్ తేజను చెప్పడం.. సమాజ పోకడకు ఒక బలమైన ఉదాహరణ. చిరంజీవి చెప్పిన మాటలను చాలామంది విమర్శించినప్పటికీ.. ఫీల్డ్ రియాలిటీ దాదాపు అదే. ది గ్రేట్ […]

Suman Son Sujay: మనం ఎంత కాదనుకున్న సరే మన సమాజం ముమ్మాటికి పితృ సమాజమే. ఇప్పటికీ మగవాళ్లను మాత్రమే వారసులుగా చూస్తూ ఉంటారు. కేవలం పేద.. మధ్యతరగతి కుటుంబాలలోనే కాదు.. పెద్దపెద్ద శ్రీమంతుల కుటుంబాలలో కూడా జరుగుతున్న తంతు ఇదే. ఆ మధ్య చిరంజీవి తన వారసుడిగా రామ్ చరణ్ తేజను చెప్పడం.. సమాజ పోకడకు ఒక బలమైన ఉదాహరణ. చిరంజీవి చెప్పిన మాటలను చాలామంది విమర్శించినప్పటికీ.. ఫీల్డ్ రియాలిటీ దాదాపు అదే.

ది గ్రేట్ రామోజీ గ్రూపుకు ఇప్పుడు మగవారసుడు వచ్చేసాడు. అదేంటి కిరణ్ ఉన్నాడు కదా.. అనే ప్రశ్న మీలో వ్యక్తం అవుతుంది కదా. కిరణ్ ఉన్నాడు.. కిరణ్ ముగ్గురు ఆడపిల్లలు కూడా ఈటీవీలో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సుమన్ కొడుకు సుజయ్ వచ్చేసాడు. అది కూడా రామోజీ గ్రూప్లో డైరెక్టర్ గా..

ఈనాడు బాధ్యతలను కిరణ్ చూసుకుంటున్నారు. ఈటీవీ కూడా ఆయనే చూస్తున్నారు. మార్గదర్శిని శైలజ కిరణ్.. రామోజీ ఫిలిం సిటీ.. డాల్ఫిన్ హోటల్స్ ను సుమన్ భార్య విజయేశ్వరి .. ప్రియా పచ్చళ్ళు.. ఇతర సంస్థలను మిగతా వాళ్ళు చూసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈటీవీ పూర్తిగా మారిపోయింది. కొత్తగా సినిమాలను కొంటున్నది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా కొనుగోలు చేయడం వెనుక సుజయ్ ఉన్నాడు. అక్కడిదాకా ఎందుకు.. ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే ఓ షో లో సుమన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుమన్ రూపొందించిన సీరియల్స్.. దాని ద్వారా గుర్తింపు పొందిన నటీమణులను తెర ముందుకు తీసుకొచ్చారు. సుమన్ కుమారుడిగా సుజయ్ ను పరిచయం చేశారు. అతడు ప్రస్తుతం ఈటీవీ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

సుజయ్ తండ్రి సుమన్ మాదిరిగానే డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్. అందువల్లే ఈటీవీ విన్ లోకి పేరుపొందిన దర్శకులను తీసుకొస్తున్నారు. కొత్త కొత్త సినిమాలను రూపొందిస్తున్నారు. చివరికి జబర్దస్త్ ప్రోగ్రాం కూడా మార్చేశారు. హైపర్ ఆది వచ్చేసాడు. సుడిగాలి సుదీర్ కూడా వచ్చేసాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. మొత్తంగా ఈటీవీ రూపురేఖలు మార్చడానికి సుజయ్ గట్టిగానే కంకణం కట్టుకున్నాడు. కాకపోతే సుమన్ గురించి గొప్పగా చెప్పి.. ప్రభాకర్ ను తెరపైకి తీసుకురాకపోవడమే పెద్ద మైనస్ పాయింట్. ఇప్పటికీ తెలియని విషయం ఏంటంటే ప్రభాకర్.. సుమన్ మధ్య ఏం జరిగింది.. రామోజీరావు ప్రభాకర్ ను ఎందుకు మెడపట్టి బయటికి గెంటేశాడు??

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper