Pushpa 2 -Hyper Adi : ఈటీవీ లో ప్రసారమయ్యే అతి పెద్ద కామెడీ షో జబర్దస్త్ గత పదేళ్లుగా నాన్ స్టాప్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా పరిచయమైనా కమెడియన్స్ నేడు ఇండస్ట్రీ లో టాప్ స్థానాల్లో ఉన్నారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు హైపర్ ఆది. ఈయన వేసే పంచులు మామూలు క్రేజ్ ఉండదు. తన నోటి ద్వారా వచ్చే పంచులతోనే ఎదుటి వ్యక్తిని చంపేస్తాడు ఆయన. అందుకే ఈమధ్య డైరెక్టర్స్ ఇతన్ని తమ సినిమాలో కమెడియన్ గా తీసుకోవడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే హైపర్ ఆది వేసే పంచులు కొన్నిసార్లు కొంతమంది హీరో హీరోయిన్స్ లేదా రాజకీయ నాయకుల అభిమానుల మనోభావాలను దెబ్బ తీసినట్టుగా అనిపిస్తుంటాయి. అలా ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ విషయం లో చేశాడు. రీసెంట్ గానే ఆయన ‘సంక్రాంతి’ సందర్భంగా ఈటీవీ లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎంటర్టైన్మెంట్ షోలో ‘పుష్ప 2’ క్యారక్టర్ చేశాడు.
ఈ క్యారక్టర్ ద్వారా ఆయన ఫన్ జెనెరేట్ చేయాలని అనుకున్నాడు కానీ, అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ‘పుష్ప 2 ‘ చిత్రంలో హీరో పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తన మనుషులను విడిపించే సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశాడు హైపర్ ఆది. స్టేషన్ కి వెళ్లి SI క్యారక్టర్ వేసిన దొరబాబుతో ‘రూల్స్ గురించి నాకే చెప్తున్నావా?’ అని అంటాడు. అప్పుడు దొరబాబు దానికి కౌంటర్ ఇస్తూ ‘నువ్వా?’ అని ఆశ్చర్యపోతాడు. అంటే అల్లు అర్జున్ రూల్స్ పాటించకపోవడం వల్లే అరెస్ట్ అయ్యాడు అనే వాదన సోషల్ మీడియా లో బాగా ప్రచారం అయ్యింది కదా, దానికి కౌంటర్ వేస్తున్నట్టు ఈ పంచ్ వేసాడు. ఆ తర్వాత దొరబాబు డైలాగ్ చెప్తూ ‘ఒకసారి లోపల వేసినోడిని బయటకి పంపేందుకు మా రూల్స్ ఒప్పుకోవు ‘ అంటాడు. దానికి ఆది కౌంటర్ ఇస్తూ ‘ఇప్పుడు అసలు పాయింట్ కి వచ్చావు..నిన్ను ఆరోజు లోపల వేస్తే బయటకి తీసుకొచ్చాం కదా’ అని అంటాడు.
ఇవన్నీ పరోక్షంగా అల్లు అర్జున్ మీద వేసిన సెటైర్లు లాగానే చూసేవాళ్లకు అనిపించింది. దీనిపై సోషల్ మీడియా లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కామెడీ పేరుతో మా హీరోని కించపరిస్తే అసలు సహించబోమంటూ హైపర్ ఆది కి సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాను వేసిన స్కిట్స్ లో ఏదైనా తప్పు జరిగితే ఎలాంటి భయం బెరుకు లేకుండా మీడియా ముందుకు వచ్చి, వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పే హైపర్ ఆది, ఈ విషయం లో కూడా రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఒకప్పుడు ఈటీవీ లో సుడిగాలి సుధీర్ చేసే ఎంటర్టైన్మెంట్ షోస్ మొత్తం ఇప్పుడు హైపర్ ఆదినే చేస్తున్నాడు.