Ka : మన టాలీవుడ్ లో ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలు ఇటీవల కాలంలో వస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీయొచ్చా, ఇలా కూడా ఆలోచించవచ్చా?, ఆ తెలివికి జోహార్లు అని అనిపించుకున్న సినిమాలు కూడా ఇటీవల కాలం లో ఉన్నాయి. గత ఏడాది విడుదలైన కిరణ్ అబ్బవరం ‘క'(KA Movie) చిత్రం ఈ కోవకు చెందిన సినిమానే. కర్మ సిద్ధాంతం మీద బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా, కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్ లోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం అయితే థియేటర్స్ లో ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇదేమి ట్విస్ట్ రా బాబు అని అనుకున్నారు చూసిన వాళ్లంతా. కిరణ్ అబ్బవరం చిన్న హీరో కాబట్టి ఈ సినిమా వసూళ్లు ఒక పరిధికి మాత్రమే పరిమితమైంది కానీ, కాస్త మీడియం రేంజ్ హీరో చేసిన పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించగల సినిమా ఇది.
Also Read : కిరణ్ అబ్బవరం ‘క’ 3 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..అంచనాలు మొత్తం తారుమారు..ఆ హీరోనే కాపాడాలి!
ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ సినిమాని చూసిందట. సినిమా వాళ్లకు బాగా నచ్చింది కానీ, క్లైమాక్స్ చాలా ఓవర్ గా ఉంది, అది తొలగించే వేరేలా మళ్ళీ రీ షూట్ చేస్తే ఈ సినిమాని మేము తీసుకుంటాము అని అన్నారట. కానీ మేకర్స్ అందుకు ఒప్పుకోలేదట. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణం లాంటిది, మా కథకి న్యాయం చేసేది కేవలం క్లైమాక్స్ మాత్రమే, దానిని మార్చేందుకు మేము ఇష్టపడము అని అన్నారట. దీంతో ఆ ఓటీటీ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేయలేదట. సరిగ్గా అలాంటి సమయంలోనే ఈటీవీ విన్(ETV Win) యాప్ ఈ చిత్రాన్ని పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందు రావడం, వెంటనే వాళ్ళతో ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడం జరిగింది. కట్ చేస్తే థియేటర్స్ లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఓటీటీ లో అంతకు మించి హిట్ అయ్యింది.
ఇప్పటికీ ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో ట్రెండ్ అవుతూ ఉందంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఈటీవీ విన్ యాప్ రేంజ్ ని కూడా బాగా పెంచేసింది ఈ చిత్రం. ఈ సినిమా కారణంగా వాళ్లకు కొత్తగా పది లక్షలకు పైగా యూజర్లు పెరిగారట. టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ సినిమాకి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే కిరణ్ అబ్బవరం ఈ సినిమా తర్వాత ‘దిల్ రూబా’ అనే లవ్ స్టోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ నెల 14 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కూడా విభిన్నమైన స్టోరీ లైన్ తోనే తెరకెక్కింది. సరైన రీతిలో తీసి ఉంటే ‘క’ ని మించిన హిట్ కూడా అవ్వొచ్చు.