Homeక్రైమ్‌Shocking Incident Girls Hostel: అర్ధరాత్రి ఆ విద్యార్థినులు గేటు దూకి ఎక్కడికి వెళ్లారు?; వైరల్...

Shocking Incident Girls Hostel: అర్ధరాత్రి ఆ విద్యార్థినులు గేటు దూకి ఎక్కడికి వెళ్లారు?; వైరల్ వీడియో

Shocking Incident Girls Hostel: తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం ఉంది. ఈ గురుకులంలో విద్యార్థినులు చదువుతున్నారు. అయితే అందులో ఇద్దరు విద్యార్థినులు ఆ గురుకులంలోని గేటు దూకి బయటికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలతో బైకుల మీద బైటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున తిరిగి వచ్చారు.

వారు అర్ధరాత్రి పూట వెళ్లిపోయి.. గురుకులంలోకి రావడం.. అది కూడా తెల్లవారుజామున రావడంతో కలకలం నెలకొంది. వాస్తవానికి ఇద్దరు విద్యార్థినులు అలా బయటకు వెళ్లడం.. తెల్లవారుజామున రావడం.. అది కూడా సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఫలితంగా ఇది కాస్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది.

ఈ వ్యవహారంలో ఆ ఇద్దరు విద్యార్థినులు గేటు దూకి బయటికి వెళ్లడం కలకలం నెలకొంది. ఆ విద్యార్థినులు ఆ సమయంలో బయటకి ఎందుకు వెళ్లారు? ఆ ఇద్దరు యువకులు ఎవరు? అర్ధరాత్రి పూట వెళ్లి.. తెల్లవారుజాము వరకు ఏం చేశారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలు మీడియా ద్వారా బయటికి రావడంతో గురుకులాలలో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు ఆ సమయంలో బయటికి వెళ్లడం ఆందోళన కలిగిస్తుంటే.. తెల్లవారుజామున మళ్ళీ గోడ దూకి విద్యాలయంలోకి వెళ్లడం కలకలం రేపుతోంది. సరైన రక్షణ వ్యవస్థ ఉంటే ఆ పిల్లలు అలా చేసి ఉండేవారు కాదు. అయితే యుక్త వయసు పిల్లలు కావడంతో.. పైగా ఆ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనాలు వేసుకొని రావడంతో..ఆ యువతులు ఆగలేకపోయారు. వారి ద్విచక్ర వాహనాలపై ఎక్కి బయటికి వెళ్లారు. ఈ సంఘటనపై గురుకుల అధికారులు విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని తెలుస్తోంది.

దీనిపై గులాబీ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. ప్రభుత్వం సరైన స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. గురుకులాలలో విద్యార్థులకు భద్రత లేదని.. ఇటీవల ఫుడ్ పాయిజన్ సంఘటనలు పెరిగిపోతున్నాయని.. ఇప్పుడేమో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైన స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular