Homeఎంటర్టైన్మెంట్AR Rahman Peddi issue: 'పెద్ది' కి రీ రికార్డింగ్ వర్క్ ఆపేసిన AR రెహమాన్..అసలు...

AR Rahman Peddi issue: ‘పెద్ది’ కి రీ రికార్డింగ్ వర్క్ ఆపేసిన AR రెహమాన్..అసలు ఏమి జరుగుతోంది!

AR Rahman Peddi issue: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై రోజురోజుకు అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రెండు ప్రమోషనల్ కంటెంట్స్ వచ్చాయి. ఒకటి గ్లింప్స్ వీడియో కాగా, మరొకటి ‘చికిరి..చికిరి’ పాట. ఈ రెండిటికీ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం తో, మార్కెట్ లో ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ […]

AR Rahman Peddi issue: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై రోజురోజుకు అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు రెండు ప్రమోషనల్ కంటెంట్స్ వచ్చాయి. ఒకటి గ్లింప్స్ వీడియో కాగా, మరొకటి ‘చికిరి..చికిరి’ పాట. ఈ రెండిటికీ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ రావడం తో, మార్కెట్ లో ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ డిమాండ్ ఏర్పడింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో ‘చికిరి..చికిరి’ పాట నే అన్ని పాటలకంటే తక్కువ నచ్చిందట మేకర్స్ కి, మిగిలిన పాటలన్నీ వేరే లెవెల్ లో ఉంటుందట. మూవీ టీం కి బాగా లేదని అనుకున్న పాటకే ఈ రేంజ్ రెస్పాన్ వచ్చిందంటే, ఇక అదిరిపోయాయి అనుకున్న పాటలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోండి. వచ్చే వారం ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇదంతా పక్కన పెడితే, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ తో సహా లాక్ చేశాడట డైరెక్టర్ బుచ్చి బాబు. రీసెంట్ గానే క్లైమాక్స్ షూట్ కూడా పూర్తి అయ్యింది. దానికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఇప్పుడు పని మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ పైన పడింది. ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ కోసం ఫస్ట్ హాఫ్ ని పంపి వారం రోజులు అయ్యిందట. ఇప్పటి వరకు ఆ పనులు మొదలు పెట్టలేదు. అంతే కాకుండా ఈ నెల 18 రంజాన్ మాసం మొదలు కాబోతుంది. ఈ సమయం లో రెహమాన్ పని చెయ్యడానికి ఇష్టపడదట. మళ్లీ ఆయన డ్యూటీ ఎక్కేది నెల రోజుల తర్వాతేనట. 18 వ తేదీ లోపు ఎంతో కొంత రీ రికార్డింగ్ వర్క్ ని ఆయన చేత పూర్తి చేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట డైరెక్టర్ బుచ్చి బాబు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ గ్యాప్ లేకుండా సాగుతోంది. రామ్ చరణ్ రెగ్యులర్ గా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇంకా నెలరోజులకు పైగా షూటింగ్ బ్యాలన్స్ ఉందట. సాధారణంగా ఈ చిత్రాన్ని మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఇంత వర్క్ బ్యాలన్స్ ఉండడంతో ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. అప్పటికైనా ప్లాన్ చేసుకున్న ప్రకారం షూటింగ్ ముగిసి , రీ రికార్డింగ్ వర్క్ పూర్తి అయితేనే చెప్పిన తేదీన విడుదల అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే మరో కొత్త విడుదల తేదీని చూసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper