Singapore Natural Disaster : అప్పట్లో 2012 యుగాంతం సినిమా చూసి అందరూ హడలి చచ్చారు. ఓర్నీ ఏంట్రా బాబు నిజంగానే అలాంటి భూకంపాలు, సునామీలు వస్తాయా? భూమి అంతం కాబోతుందా? అన్న భయాలు అందరిలోనూ అప్పట్లో నెలకొన్నాయి. తినే వారు తిన్నారు.. కడుపునిండా తాగిన వారు ఉన్నాయి. అప్పట్లో 80వ దశకంలో స్కైలాబ్ సమయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.
అయితే అలాంటి భూమి బద్దలు అయ్యే సీన్లు కేవలం సినిమాల్లోనే కాదు.. రియల్ లోనూ మన కళ్లముందు కనిపిస్తాయి. సింగపూర్ లో అలాంటి ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. అవును ఇది నిజంగా జరిగింది.
సింగపూర్ లో రోడ్డు దాటేందుకు వేచి ఉన్న కారు సిగ్నల్ పడగానే మూల మలుగుతోంది. సడెన్ గా కారు ఉన్న చోట భూమి బద్దలైంది. అమాంతం భూమి కుప్పకూలింది. కారు మొత్తం భూమిలో పడిపోయింది. అతి కష్టం మీద కారులో ఉన్న మహిళను రోడ్డు కార్మికులు పైకి తీసి ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు రెండు కార్లు ఆ రోడ్డు గుండా వెళ్లినా ఏం కాలేదు. ఈ మహిళ కారు మాత్రం భూమిలోపల పడిపోయింది. వెనుకాల ఉన్న కారులో ఇదంతా రికార్డ్ అయ్యింది. భయంతో ఆ కారు వెనక్కి మలచడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ దారుణ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.