HomeతెలంగాణCM Revanth Reddy : రేవంత్ ఏరి  కోరి తెచ్చుకున్న  శ్రీనివాస్ రెడ్డి పై వేటు...

CM Revanth Reddy : రేవంత్ ఏరి  కోరి తెచ్చుకున్న  శ్రీనివాస్ రెడ్డి పై వేటు దేనికి  వేసినట్టు… సివి ఆనంద్ కు మళ్లీ హైదరాబాద్ ఎందుకు అప్పగించినట్టు? 

CM Revanth Reddy :  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పై రేవంత్ ప్రభుత్వం వేటు వేయడం సంచలనం కలిగించింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర సిపిగా పనిచేసిన ఆనంద్ కు రేవంత్ ప్రభుత్వం తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఇచ్చింది. రేవంత్ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సంచలనంగా మారింది. వినాయక చవితి నాడు దాదాపు ఐదుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ నగర్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి స్థానచలనం కలిగించింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా హైదరాబాద్ నగర కమిషనర్ గా నియమించారు. ఏరి కోరి తెచ్చుకున్న అధికారిపై ఆయన బదిలీ వేటు వేయడం సంచలనంగా మారింది. అప్పట్లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సివి ఆనంద్ కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఆయనప్పటికీ ఆయనను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి పిలిపించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నియమించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో డిజిపి అంజనీ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఆ తర్వాత రేవంత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సివి ఆనంద్ ను ఏసీబీ డీజీగా రేవంత్ నియమించారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వాటి ఆరోపణలకు తగ్గట్టుగానే హైదరాబాద్లో పరిస్థితులు ఉన్నాయి. దీంతో రేవంత్ శ్రీనివాస్ రెడ్డిని పక్కనపెట్టి.. ఆనంద్ వైపు మొగ్గు చూపించారని తెలుస్తోంది.
ఆనంద్ కు అనుభవం ఎక్కువ
 శ్రీనివాస్ రెడ్డి కంటే ఆనంద్ కు హైదరాబాద్ నగరం పై పట్టు ఎక్కువగా ఉంది. గతంలో ఆయనకు హైదరాబాద్ నగర కమిషనర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పైగా హైదరాబాదులో శనివారం నుంచి గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల్లోనే నిమజ్జనం ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు రేవంత్ తన మానస పుత్రికగా అభివర్ణిస్తున్న హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు రోజురోజుకు సంచలనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు స్థాన చలనం కలిగించి.. ఆ ప్లేస్ లో సివి ఆనంద్ ను రేవంత్ నియమించాలని తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా  నియమించారు. విజయ్ కుమార్ కు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. వీరు మాత్రమే కాకుండా త్వరలోనే మరికొందరు సీనియర్ అధికారులకు ఇలాగే స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper