Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ సంబంధాలు, విమర్శలు, సంప్రదాయిక కట్టుబాట్లు ఎప్పుడూ కలగలిసి ఉంటాయి. అయితే గొడవల కారణంగా కొందరు సొంత వాళ్లకు దూరమవుతున్నారు. కొందరు దూరమైనవాళ్లు పండుగలు, వేడుకల వేల దగ్గరవుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా టీఆర్‌ఎస్(తెలంగాణ రక్షణ సేన) అధినేత కల్వకుంట్ల కవిత సొంత కుటుంబానికి దూరమయ్యారు. రాఖీ సండుగ సందర్బంగా రెండేళ్లుగా కేటీఆర్‌కు రాఖీ కట్టడం లేదు. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ.. రాఖీ పండుగ సందర్భంగా సీఎంకు దగ్గరయ్యారు. శుక్రవారం(ఆగస్టు 28న) మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. సురేఖ కూతురు సుష్మిత ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో దీని వెనుక రాజకీయ సంకేతాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
సీఎంపై తీవ్ర విమర్శలు చేసిన సుష్మిత..
కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల వ్యక్తిగత విమర్శలు చేశారు. పరకాల టికెట్ విషయంలో సీఎం చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పరుశ పదజాలంతో చేసిన విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన అటువంటి వ్యాఖ్యలు సాధారణంగా పార్టీ అంతర్గత సంబంధాలపై ప్రభావం చూపుతాయి. అయితే తాజాగా కొండా సురేఖ స్వయంగా సీఎం నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం, ఈ విమర్శలకు ఒక విధంగా సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తోంది.
సంప్రదాయం వెనుక రాజకీయం
రాఖీ పండుగ సోదరి–సోదరుడి మధ్య రక్షణ, స్నేహం, కుటుంబ బంధాన్ని సూచిస్తుంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ సీఎంకు రాఖీ కట్టడం ఈ సంప్రదాయాన్ని అనుసరించినట్టు కనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో ఇలాంటి చర్యలు కేవలం వ్యక్తిగతంగా ఉండవు. ఇది అంతర్గత విభేదాలను తగ్గించే ప్రయత్నంగా, లేదా పార్టీ ఐక్యతను ప్రదర్శించే సంకేతంగా చూడవచ్చు. సుస్మిత విమర్శల తర్వాత కొండా సురేఖ స్వయంగా రాఖీ కట్టడం వల్ల వివాదం తెరపడింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తప్పించాలన్న క్రమశిక్షణ కమిటీ..
సుష్మిత వ్యాఖ్యలతో మంత్రి సురేఖకు నోటీసులు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీకి సురేఖ వివరణ ఇచ్చారు. సుష్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు. దీనిపై అనేక తర్జనభర్జనల తర్వాత కొండా సురేఖను తప్పించాలని క్రమశిక్షణ కమిటీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు నివేదిక ఇచ్చింది. పీసీసీ చీఫ్ దానిని అధిష్టానానికి పంపారు. వారం రోజుల్లో వేటు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సరేఖ రేవంత్‌రెడ్డిని కలవడం, రాఖీ కట్టడం ఇది ఉపశమనం కలిగించే అడుగు భావిస్తున్నారు.
బంగారు రాఖీ కట్టా..
సీఎం రేవంత్‌కు స్పెషల్ గోల్డ్ రాఖీని వరుసగా మూడో ఏడాది కట్టానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీఎంతోపాటు ఆయన అల్లుడు, మనవడికి కూడా రాఖీ కట్టినట్లు చెప్పారు. సీఎం నుంచి భరోసా దక్కిందా అని జర్నలిస్టులు అడగగా ‘పండుగ వేళ ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదు. అన్న రేవంత్ ఆశీర్వాదాలు నాతో సహా ఆడపడుచులందరికీ ఉంటాయి’ అని పేర్కొన్నారు. రాఖీ కట్టడం ద్వారా కొండా సురేఖ తన వైఖరిని స్పష్టం చేసినట్టు కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల విమర్శలకు మంత్రి స్థాయిలో సమాధానం ఇచ్చినట్టు భావించవచ్చు.
తెలంగాణలో పండుగలు, కుటుంబ బంధాలు రాజకీయ సంబంధాలను మరింత దగ్గర చేస్తాయి. రాఖీ లాంటి చర్యలు ఒకవైపు సంప్రదాయికంగా కనిపిస్తే, మరోవైపు అధికార పార్టీలోని సంబంధాలను బలోపేతం చేసే సాధనంగా కూడా పనిచేస్తాయి. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మధ్య సంబంధం సామరస్యంగా ఉందని ఈ సంఘటన సూచిస్తోంది.
నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్క గారితో కలిసి సోదరులు ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని వారి నివాసంలో కలసి, రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశాను.
మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా… pic.twitter.com/SwelDvHyxy
— Konda Surekha (@iamkondasurekha) August 28, 2026