సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత.. జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది తమను తాను డెమీ గాడ్స్ మాదిరిగా భావిస్తుంటారు. తమను తాము గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో దొరికిపోయిన తర్వాత ఉల్టా చోర్ అనే సామెతను నిజం చేసి చూపిస్తుంటారు. అలాంటిదే ఈ ఎపిసోడ్ కూడా.
వేములవాడలో ఇటీవల ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయితో కలిసి.. మాధురి రాథోడ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయిని.. మాధురి రాథోడ్ ను అందరికీ చూపించింది ఈశ్వర్ సాయి భార్య. ఆ తర్వాత మాధురి రాథోడ్ ను కొట్టింది. ఆ తర్వాత మీడియా ముందు సంచలన విషయాలను వెల్లడించింది. మాధురికి బ్రేకప్ అయిందని.. తానే ఆమెను ఓదార్చానని.. చివరికి ఆమె తన కొంపకు ఎసరు పెట్టిందని ఈశ్వర్ సాయి భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
పైగా ఇటీవల విలేకరుల ముందుకు వచ్చిన ఈశ్వర్ సాయి భార్య.. ప్లేట్ ఫిరాయించింది. వారిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని కోరింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితోనే వదిలిపెట్టాలని చెప్పింది. ఆ తర్వాత ఈశ్వర్ సాయి తెరమీదకి వచ్చాడు. అదంతా ఒత్తిడిలో జరిగిపోయిందని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు మాధురి రాథోడ్ ఒక సెల్ఫీ వీడియో ద్వారా జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది.. ఉపయోగకరమైన కంటెంట్ ఇస్తున్నానని.. కానీ వివాదాలు గొడవల మీదనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఆమెతో చెప్పుకొచ్చింది.
తాను 30 రోజులపాటు మినీ వ్లాగ్ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పింది. మంచి కంటెంట్ ఇస్తున్నప్పటికీ వివాదాస్పదమైన విషయాలకే ఆదరణ లభిస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. ఈశ్వర్ సాయితో హోటల్ కి వెళ్లిందెవరు.. అక్కడ ఆమె భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఎవరు.. ఆమె భార్య అదే పనిగా చెంప మీద కొడుతుంటే పడింది ఎవరు.. పాపం మాదిరి రాథోడ్ బిగ్ బాస్ బాగా చూస్తుంది అనుకుంటా.. అందుకే మహానటి లెవెల్లో నటించింది. కానీ తల తోక లేకుండా మాట్లాడి దొరికిపోయింది. మాధురి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మాధురి రాథోడ్ ను చాలా మంది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కావాలని అతడితోకలిసి హోటల్ కు వెళ్లి ..ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయితో కలిసి గదిలో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీనిపై మాధురి రాథోడ్ తాజాగా స్పందించారు. ఉపయోగకరమైన కంటెంట్ కంటే వివాదాలు, గొడవలపైనే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి ఉంటోందని చెప్పారు.
తాను 30 రోజుల మినీ వ్లాగ్ ఛాలెంజ్ చేస్తున్నానని… pic.twitter.com/HnKrnYyDUU
— RTV (@RTVnewsnetwork) August 24, 2026