spot_img
HomeతెలంగాణDSP Praneeth Rao: రేవంత్ చేతిలో ప్రణీత్ జుట్టు.. బయట పడుతుందా కేసీఆర్, కేటీఆర్ గుట్టు?

DSP Praneeth Rao: రేవంత్ చేతిలో ప్రణీత్ జుట్టు.. బయట పడుతుందా కేసీఆర్, కేటీఆర్ గుట్టు?

DSP Praneeth Rao: అంతా వారే. అన్నింటా వారే. అందుకే పదేళ్లపాటు దర్జాగా అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. ప్రతిపక్షాల కుసాలు విరిగిపోయాయి. అధికార పక్షానికి అన్ని వ్యవస్థలు సలాం చేశాయి. గడచిన పది సంవత్సరాలు మాత్రమే కాదు.. వచ్చే ఏళ్లల్లోనూ తమదే అధికారం అనేలాగా గులాబీ కాంపౌండ్ నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. ఇంతటి ఆత్మవిశ్వాసం ప్రదర్శించినప్పటికీ భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అనేలాగా.. అప్పటి పాలనా కాలం నాటి ఘనకార్యాలు మొత్తం ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. అయితే అందులో ప్రణీత్ రావు అనే డి.ఎస్.పి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

వాస్తవానికి ప్రణీత్ రావు తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎస్సై స్థాయి అధికారి. కానీ అనూహ్యంగా డి.ఎస్.పి పదోన్నతి పొందారు. ఎస్ ఐ బి లో పనిచేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి డిఎస్పీగా పదోన్నతి వచ్చిన ఒక అధికారికి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే పోస్ట్ ఇస్తుంది. కానీ వాటన్నింటికీ భిన్నంగా ఆయనను ఎస్ ఐ బి లో నియమించింది. ఎస్ఐబిలో ప్రణీత్ రావు డిఎస్పీగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చక్కబట్టేవారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ను నక్సలైట్లు, టెర్రరిస్టులపై ప్రయోగిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయ నాయకుల మీద ఉపయోగించారు. ఈ వ్యవహారం ప్రణీత్ రావు ఆధ్వర్యంలో దర్జాగా సాగిందని, దీనికి అప్పటి ప్రభుత్వ పెద్దలు తెరవెనుక సహాయం చేశారనే విమర్శలు ఉన్నాయి. పదవి విరమణ చేసినప్పటికీ ఓ కీలక అధికారి ఇంటలిజెన్స్ విభాగంలో ముఖ్యపాత్ర పోషించారని.. ఆయన గత ప్రభుత్వ పెద్దలకు దగ్గరగా ఉండేవారని.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆయనే పర్యవేక్షించే వారిని తెలుస్తోంది.

భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోగానే ఇంటిలిజెన్స్ లో కీలకంగా పనిచేసిన ఆ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు డి.ఎస్.పి ప్రణీత్ రావు కూడా చాలా వరకు రికార్డులను ధ్వంసం చేశారని తెలుస్తోంది. ఇది బయటి ప్రపంచానికి తెలియకుండా సీసీ కెమెరాలను పనిచేయకుండా నిలుపుదల చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడంతో.. ఆ రికార్డులను రీ ట్రీవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రణీత్ రావు వద్ద కీలక సమాచారం ఉందని.. దాని ద్వారా కెసిఆర్, కేటీఆర్ సాగించిన వ్యవహారాలను తెలంగాణ సమాజం దృష్టికి తీసుకురావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అప్పట్లో ప్రణీత్ రావు ఏపీ సీఎం ఫోన్ కూడా ట్యాప్ చేశారని.. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ తర్వాత బయటికి వచ్చిందని.. ఇలా ఎంతోమంది ఎమ్మెల్యేల ఫోన్లు టాప్ చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. భారత రాష్ట్ర సమితి ఇతర పార్టీల ఎమ్మెల్యేల విలీనానికి ప్రణీత్ రావు తోడ్పడ్డాడని.. దానికి ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారని తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన వ్యవహారాలను మొత్తం తవ్వితీయాలని రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper