spot_img
HomeతెలంగాణHyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ కు వెళ్ళి ఎందుకు అందరు చనిపోతున్నారు..? అసలు కథేంటి?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ కు వెళ్ళి ఎందుకు అందరు చనిపోతున్నారు..? అసలు కథేంటి?

Hyderabad Metro: విశ్వనగరం హైదరాబాద్‌కు ఉన్న కీలక ఆభరణాల్లో మెట్రో ఒకటి.. నగరానికి మొట్రో వచ్చాక ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ చాలా వరకు తగ్గింది. నగర వాసులకు రవాణా సులభతరమైంది. ఏటా మెట్రో ఎక్కేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మరిన్ని రూట్లతో మెట్రోను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే.. మెట్రో స్టేషన్లు.. ఇప్పుడు సూసైడ్‌ స్పాట్లుగా మారడమే ఆందోళన కలిగిస్తోంది. మెట్రో 2019లో ప్రారంభం కాగా, ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగాయి.

పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య..
మెట్రో ప్రారంభంలో రోజుకు లక్ష మంది ప్రయాణించేవారు. గడిచిన నాలుగేళ్లలో ఈ సంఖ్య ఐదు రెట్టు పెరిగింది. ప్రస్తుతం 5.10 లక్షల మందిని మెట్రో రైళ్లు వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ తగ్గడం లేదు. దీంతో మెట్రో టైమింగ్స్‌ను పొడిగించారు. అదనపు బోగీలు పెంచాలన్న డిమాండ్‌ వస్తోంది.

ఆగస్టు నుంచి అదనపు బోగీలు..
వచ్చే ఆగస్టు నుంచి మెట్రో రైళ్లకు మూడు అదనపు బోగీలు కలపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం కోచ్‌లు కొనుగోలు చేయడం కష్టం కావడం, సమయం పట్టే అవకాశం ఉండడంతో అద్దెకు తీసుకోవాలని హైదరాబాద్‌ మెట్రో అధికారులు నిర్ణయించారు. ఈమేరకు చెన్నై, నాగపూర్‌ మెట్రో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఐదేళ్లలో ఆరు ఆత్మహత్యలు..
ఇక హైదరాబాద్‌ మెట్రో ప్రారంభమై ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో మెట్రో స్టేషన్లలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేయగా, స్థానికులు గమనించి కాపాడారు. 2021లో దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేటలో ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో ఈఎస్‌ఐ, మూసాపేట మెట్రో స్టేషన్లలో ఒక్కొక్కరు సూసైడ్‌ చేసుకున్నారు. తాజాగా కేపీహెచ్‌బీ స్టేసన్‌లో ఆదివారం ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

సెక్యూరిటీ పెంపుపై దృష్టి..
మెట్రో స్టేషన్లు సూసైడ్‌ స్పాట్లుగా మారుతున్నాయని ఆరోపణలు పెరుగుతుండడంతో హైదరాబాద్‌ మెట్రో అధికారులు సెక్యూరిటీ పెంపుపై పునరాలోచన చేస్తున్నారు. స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీతోపాటు అదనపు సిబ్బంది ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో సీసీ కెమెరాలు కూడా అదనంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ప్రయాణికులతోపాటు మెట్రోకు సెక్యూరిటీ కోసం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రయాణికులు కూడా సెక్యూరిటీ పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆత్మహత్యల నియంత్రణకు ఇదే పరిష్కారమని సూచిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper