HomeతెలంగాణHyderabad Metro : అర్ధరాత్రి దాకా మెట్రో.. వాటిల్లో ఉచితంగా ప్రయాణం.. హైదరాబాద్ వాసులకు న్యూ...

Hyderabad Metro : అర్ధరాత్రి దాకా మెట్రో.. వాటిల్లో ఉచితంగా ప్రయాణం.. హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ గిఫ్ట్ మామూలుగా లేదుగా..

Hyderabad Metro : ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ను ఐకానిక్ సింబల్ గా చూపించేవారు. ఇప్పుడు మాత్రం హైటెక్ సిటీ ఆ ప్రాంతాలను చూపిస్తున్నారు. సైబరాబాద్ నుంచి మొదలు పెడితే నానక్ రామ్ గూడ వరకు కొత్త సిటీగా పేర్కొంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ దేశానికే తలమానికంగా నిలిచే విధంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ జరిగే నూతన సంవత్సర వేడుకలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. జనం విందులు, వినోదాలు ఇతర సందడులతో ఉత్సాహంగా ఉంటారు కాబట్టి హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర వేడుక గిఫ్ట్ ను అందించింది. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 న హైదరాబాద్ నగర వాసులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్, రాచకొండ, హైబరాబాద్ పరిధిలో ఉన్న 500 కార్లు, 250 బైక్ టాక్సీలు హైదరాబాద్ నగర వాసులతో ఉచిత ప్రయాణం సాగించే అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే మధ్యమధ్యలో ప్రమాదాలకు గురికాకుండా ఉండడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలు మద్యం తాగి గాయాల పాలవుతున్నారని.. అందువల్లే తాము నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాదులో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. మంగళవారం రాత్రి 12;30 గంటలకు చివరి రైలు బయలుదేరుతుందని హైదరాబాద్ మెట్రో రైల్వే అధికారులు పేర్కొన్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను విస్తృతంగా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో.. హైదరాబాద్ నగర ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరడానికి మెట్రో ప్రయాణం సహకరిస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు డిసెంబర్ 31 ను పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో ఉన్న ఫ్లై ఓవర్లను మొత్తం మూసివేస్తామని పోలీసులు ప్రకటించారు. మద్యం తాగి రోడ్ల మీదకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని వివరించారు. “డిసెంబర్ 31 సందర్భంగా చాలామంది యువత మద్యం తాగి బయటికి వస్తారు. ఆ సమయంలో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించినప్పటికీ.. కొంతమంది తమ ధోరణి మార్చుకోరు. అలాంటి వారికోసం ఈ పని చేస్తున్నామని” పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular