3kW Solar System: నెల నెలా కరెంట్ బిల్లును చూస్తే షాక్ అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో విద్యుత్ అవసరాలకు శక్తికి మించి పవర్ ను వాడుతున్నాం. దీంతో కరెంట్ బిల్లు వేలల్లో వస్తోంది. సామాన్యుల నుంచి మిడిల్ క్లాస్ పీపుల్స్ కు వచ్చే ఆదాయంలో 25 శాతం ఈ బిల్లులు చెల్లించడానికే సరిపోతుంది. దీంతో కరెంట్ బిల్లులను తగ్గించుకోవడానికి అవసరాలను మార్చుకుంటున్నారు. అయితే మీకుండే అవసరాలు తీరడంతో పాటు ప్రభుత్వానికి కూడా మీరు మిగులు కరెంట్ ను ఇవ్వొచ్చు. దీంతో మీరు ప్రభుత్వానికి ఎంత బిల్లు చెల్లిస్తే అంత అమౌంట్ కూడా ఇస్తుంది. అదిరిపోయే ఈ ప్లాన్ గురించి వెంటనే తెలుసుకోండి..
పవర్ కు ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్ ఎప్పుడో వినియోగంలోకి వచ్చింది. దీనిపై చాలా కంపెనీలు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది పట్టించుకోవడం లేదు. కానీ ముందుగా కొంచెం పెట్టుబడి పెట్టేవారైతే వారికి ఆ తరువాత వద్దన్నా ఆదాయం వస్తుంది. సోలార్ ప్లేట్స్ ద్వారా మీరు విద్యుత్ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా విద్యుత్ ను అందించవచ్చు. అయితే సోలార్ ప్లాంట్ నెలకొల్పాలంటే సొంత ఇల్లుతో పాటు కాస్త పెట్టుబడి పెట్టాలి. ఆ వివరాలేంటో చూద్దాం..
ఒక్కరూపాయి కూడా మీకు కరెంట్ బిల్లు రాకుండా ఉండాలంటే ఇంటిపై 3KV సోలార్ ప్లాంట్ నెలకొల్పాలి. ఇది ప్రతి నెల 360 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అది కూడా On Grid Solar System అంటే మీ ఇంటిపై సోలార్ ప్లేట్స్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారనుకోండి. ఆ సోలార్ ప్లాంట్ మీ అవసరా ల మేరకు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే అవసరాలకు మించి ఉత్పత్తి అయితే ఆ పవర్ ప్రభుత్వానికి వెళ్లెలా దగ్గర్లో ఉన్న పవర్ గ్రిడ్ కు కనెక్షన్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు ప్రభుత్వానికి ఎంత విద్యుత్ చెల్లిస్తారో అంత మొత్తంలో ప్రభుత్వమే మీకు బిల్లు చెల్లిస్తుంది.
ఒకవేళ సోలార్ ప్లాంట్ తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసినప్పుడు మీకు అవసరమైన కరెంట్ ను కనెక్షన్ ఇచ్చిన గ్రిడ్ నుంచి పొందవచ్చు. ఇలా చేయడం వల్ల రెండు విధాలుగా మీరు విద్యుత్ ద్వారా సేప్ గా ఉంటారు. అవసరమైనప్పుడు విద్యుత్ ను ఎక్కువైనప్పుడు ప్రభుత్వానికి చెల్లించడం ద్వారా మీరు కరెంట్ బిల్లు జీరో అవుతుంది. అయితే ఈ ప్లాంట్ నెలకొల్పడానికి 2,20,000 ఖర్చు అవుతుంది. దీనికి ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తుంది.