Rohit Sharma: రోహిత్ శర్మ…ప్రస్తుతం టీం ఇండియాలో తిరుగులేని పేరు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఆన్ ఫీల్డ్ వణికించే రోహిత్ తన మతిమరుపుతో తన టీం మేట్స్‌ని కూడా వణికిస్తాడు. న్యూజిలాండ్ లో జరిగిన రెండవ వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని చెప్పడానికి తడబడ్డాడు. అంతేకాదు టీం తీసుకున్న నిర్ణయం మర్చిపోయాను అని చెప్పి అందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఆ సమయంలో అతని ప్రవర్తనకి ప్రత్యర్థి కెప్టెన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.
ఈ ఇన్సిడెంట్‌తో రోహిత్ శర్మకు మతిమరుపు ఉంది అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత రోహిత్‌కి ఉన్న మతిమరుపు గురించి విరాట్ కోహ్లీ కూడా పేర్కొనడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యుత్తమ ఓపెనర్ , వన్డే క్రికెట్‌లో మూడు డబల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్, క్రికెట్ మూడు ఫార్మాట్‌లో శతకాలు సాధించిన ఆటగాడు…ప్రతి చిన్న విషయాన్ని మర్చిపోతాడు అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

టి20 ఫార్మేట్ అయినా ,50 ఓవర్ల వన్డే క్రికెట్ అయినా కెప్టెన్సీ వహించడం అంటే మాటలు కాదు. ఆన్ ఫీల్డ్ ఎంతో చురుకుగా ఉండాలి.. పడే ప్రతి బంతి దగ్గర నుంచి ప్రతి షాట్ వరకు లెక్క కచ్చితంగా ఉండాలి.. ఫీల్డర్‌ని ఎక్కడ ఉంచాలి? బౌలర్ దగ్గర ఎన్ని ఓవర్లు వేయించాలి? క్రీజులో ఉన్న ప్రతి బ్యాటర్ బలాబలాలు ఏంటి? ఇలా కెప్టెన్ బ్రెయిన్ ఎప్పుడు ఎన్నో విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి రోహిత్ ఇవన్నీ మర్చిపోకుండా ఎలా చేస్తున్నాడు అనేది ప్రశ్నార్థకం.
ఐపీఎల్ క్రికెట్ లీగ్ లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపిన ఏకైక కెప్టెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ కి ఉన్న రికార్డ్ కూడా తిరుగులేనిది అనే చెప్పవచ్చు. మరి అలాంటి ప్లేయర్‌కు మతిమరుపు ఉంది అంటే ఒక పట్టాను ఎవరికి నమ్మబుద్ధి కలవడం లేదు. అయితే రోహిత్ మ్యాచుల కోసం ప్రయాణం చేసే ప్రతిసారి బస్సులో ఏదో ఒక ఖరీదైన వస్తువు మర్చిపోతూ ఉంటాడని కోహ్లీ చెప్పారు.
విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో ఒకసారి ఎంతో ముఖ్యమైన పాస్పోర్టును కూడా రోహిత్ మర్చిపోవడం జరిగిందట. ఇలాంటి సందర్భాలు తమకు చాలా కామన్ అని విరాట్ అన్నారు. తమ టీం లాజిస్టిక్స్ మేనేజర్ నిరంతరం రోహిత్ కి సంబంధించిన వస్తువుల గురించి ఆరా తీస్తూ ఉంటారని.. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మొదట రోహిత్ వస్తువులన్నీ సరిచూసుకున్న తర్వాతే తమ టీం బస్ ప్రయాణం మొదలు పెడుతుందని విరాట్ చెప్పారు.
నిన్న మొన్నటి వరకు రోహిత్ గురించి అతని బ్యాటింగ్ గురించి పోస్టులు పెట్టిన నేటిజన్స్ ప్రస్తుతం అతని మతిమరుపుకు సంబంధించి పోస్టులు పెడుతున్నారు. ఫీల్డింగ్ కావాలా ? బ్యాటింగ్ కావాలా ? అన్న నిర్ణయం చెప్పడానికి తట పటాయించిన వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో అప్పటినుంచి రోహిత్ మెమరీ లాస్ వార్త ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. అయితే రోహిత్ మాత్రం తనలో ఏదైనా లోపం ఉంది అని చెప్పాలంటే అది కేవలం విలువైన వస్తువులను మర్చిపోయే మతిమరపే అని తనకున్న ప్రాబ్లం తమాషాగా వ్యక్తం చేశారు. ఇది కేవలం మతిమరుపేనా లేక ఏదన్నా వింత వ్యాధా .. అని కొందరు అభిప్రాయపడుతున్నారు.