spot_img
Homeటాప్ స్టోరీస్Marwadi Go Back: గో బ్యాక్ మార్వాడి.. తెలంగాణలో ఎందుకీ ఉద్యమం?

Marwadi Go Back: గో బ్యాక్ మార్వాడి.. తెలంగాణలో ఎందుకీ ఉద్యమం?

Marwadi Go Back: తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆలంబనగా ఉంది. వారు బతకడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సిక్కుల నుంచి మొదలుపెడితే ఆంధ్ర వారి వరకు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణలో బతుకుతున్నారు. తెలంగాణ కేంద్రంగా వార్తల వ్యాపారాలను అంతకంతకు విస్తరించారు. వాస్తవానికి ఆంధ్ర వారి కంటే కూడా తెలంగాణలో మార్వాడి వారికే ఎక్కువగా వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే అమీర్పేట, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాలలో మార్వాడీలు అధికంగా విస్తరించారు. మొదట్లో మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు. వీరిలో ప్రధానంగా మిఠాయి దుకాణాలు కొనసాగించేవారు. ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు. ఇక్కడ కుటుంబాలకు కుటుంబాలుగా ఏర్పడి.. ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సాధించారు.

Also Read: గంభీర్ కు ఉద్వాసన.. టీమిండియా టెస్ట్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్..

మార్వాడి వ్యాపారులు మొదట్లో స్థానికులకు ఉపాధి కల్పించేవారు. అయితే ఇటీవల కాలంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారు. స్థానికుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో మార్వాడి వ్యాపారులకు స్థానిక వ్యాపారులకు వాగ్వాదాలు జరిగాయి. సోషల్ మీడియా వల్ల ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. నీతో ఏకంగా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ఉన్న మార్వాడి వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా.. వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రాంతంలో బంద్ కు స్థానిక వ్యాపారులు పిలుపునిచ్చారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానిక వ్యాపారులు మార్వాడి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్వాడిల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని.. వాళ్ల మనుషులకే ఉద్యోగాలు ఇస్తున్నారని స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. అంతేకాదు ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అమనగల్లు ప్రాంతంలో బంద్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడి అనే యాష్ ట్యాగ్ విపరీతమైన ట్రెండ్ లో ఉంది. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper