Team India Test Coach : ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ ట్రోఫీని అందుకోలేకపోయినప్పటికీ.. సిరీస్ చేజారనివ్వలేదు. ఆతిథ్య జట్టు సొంతవేదిక మీద చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రదర్శన చేసింది. ఈ సిరీస్లో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ప్రయోగాలకు సిద్ధం కాగా.. ఆ ప్రయోగాలు సరైనవేనని టీమిండియా ప్లేయర్లు నిరూపించారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్లో చెప్పుకునే స్థాయిలోనే ఫలితాన్ని సాధించిన నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే జాతీయ మీడియాలో ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గౌతమ్ గంభీర్ ను టెస్టు ఫార్మాట్ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ను నియమిస్తారని సమాచారం.
వివిఎస్ లక్ష్మణ్ టీమిండియాలో లెజెండరీ ఆటగాడిగా కొనసాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో రాహు ద్రావిడ్ తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం సుదీర్ఘ ఫార్మాట్ మాత్రమే కాకుండా వన్డేలలో కూడా భారత జట్టుకు విలువైన సేవలు అందించాడు. అండర్-19 జట్టుకు శిక్షకుడిగా తన మార్క్ చూపించాడు. వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం భారత యువజట్టుతో ప్రయాణిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి రెండుసార్లు ప్రవేశించిన టీమిండియా.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో మాత్రం ఆ ఘనతను అందుకోలేకపోయింది. టీమ్ ఇండియా స్థాయికి ఈ ఓటములు ఏ మాత్రం తగ్గవి కావు. అందువల్లే టెస్ట్ ఫార్మాట్ విషయంలో ప్రక్షాళన చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
గౌతమ్ గంభీర్ ను పరిమిత ఓవర్ల క్రికెట్ కు మాత్రమే ఉంచాలని.. సుదీర్ఘ ఫార్మాట్ కు వీవీఎస్ లక్ష్మణ్ ను కోచ్ గా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో కూడా ఇదే తీరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు భారత క్రికెట్ మేనేజ్మెంట్ అధికారిక ప్రకటన చేయలేదు. అటు వివిఎస్ లక్ష్మణ్ నుంచి కూడా ఎటువంటి ధ్రువీకరణ రాలేదు. భారత క్రికెట్ పెద్దల మదిలో ఈ ఆలోచన ఉన్నప్పటికీ.. ఇప్పుడప్పుడే దీనిని అమల్లో పెట్టరని తెలుస్తోంది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీం ఇండియా గనుక ఓటమిపాలైతే గౌతమ్ గంభీర్ కు స్థాన చలనం ఉండేదని.. ఇప్పుడప్పుడే మేనేజ్మెంట్ ఆయనను సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పించే అవకాశం లేదని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ ఆ టోర్నీకి జట్టును ప్రకటించే పనిలో బిజీబిజీగా ఉంది.
భారత టెస్ట్ క్రికెట్ కు గౌతమ్ గంభీర్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్ గా నియమితులయ్యే అవకాశం!? pic.twitter.com/bb4ifGg9eE
— OkTelugu (@oktelugunews) August 15, 2025